సమంత రెమ్యూనరేషన్ మరీ అంతనా..!

Update: 2018-09-18 06:24 GMT

నటిగా తెలుగులో ఎన్నో విజయాలు అందుకున్న సమంత లేటెస్ట్ గా నటించిన 'యూ-టర్న్' చిత్రం వినాయక చవితి రోజున విడుదలై మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కన్నడ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది. ఈ సినిమా కోసం సమంత భారీ రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తుంది. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ ముట్టిందట. సాధారణంగా సమంత ఏ సినిమాకైనా కోటి నుండి కోటిన్నర తీసుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం ఆలా చేయలేదట. రెమ్యూనరేషన్ బదులుగా ప్రీ రిలీజ్ బిజినెస్ లో వాటా తీసుకుందట.

ఒక్క సినిమాకు మూడు కోట్లు...

ఈ సినిమా 16కోట్ల బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే. అంటే సామ్ వాటాగా ఆ లెక్కన ఆమెకు 3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ వెళ్లిందని సమాచారం. లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం, పైగా మంచి మెసేజ్ తో కూడా సినిమా కావడంతో ప్రేక్షకులు దీన్ని హిట్ చేశారు. సమంత పెళ్లి తర్వాత చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో తన రూట్ మర్చి రెమ్యూనరేషన్ కి బదులు ప్రీ రిలీజ్ బిజినెస్ లో వాటా తీసుకుంది. దీనికి ప్రొడ్యూసర్స్ కూడా నో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే సామ్ క్రేజ్ అటువంటిది.

Similar News