ఆ రూమర్ పై సామ్ ఫైర్ అయ్యింది..!

సమంత స్టార్ హీరోయిన్ అని తెలిసిందే. కానీ ప్రస్తుతం సమంత స్టార్ హీరోస్ తో సినిమాలు చేయడం లేదు. మీడియం రేంజ్ హీరోస్ తో సినిమాలు చేస్తుంది. [more]

Update: 2019-03-23 08:37 GMT

సమంత స్టార్ హీరోయిన్ అని తెలిసిందే. కానీ ప్రస్తుతం సమంత స్టార్ హీరోస్ తో సినిమాలు చేయడం లేదు. మీడియం రేంజ్ హీరోస్ తో సినిమాలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల సమంత కొన్ని విషయాల్లో కండిషన్స్ పెట్టొచ్చు. అయితే సమంత లేటెస్ట్ గా చేయబోయే 96 రీమేక్ సినిమా విషయంలో ఇలానే చేస్తుందట. తమిళ సూపర్ హిట్ చిత్రం 96 చిత్రాన్ని సమంత తెలుగులో శర్వానంద్ తో చేయడానికి ఓకే చెప్పింది. అయితే తన పాత్ర పరిధి పెంచమని దర్శకులని డిమాండ్‌ చేస్తోందని, తన ఇష్టానికి అనుగుణంగా కథలో మార్పులు కోరుతోందని ఆమె గురించి వార్తలు వస్తున్నాయి.

అవన్నీ అబద్దాలు

డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ని ఇటువంటి కండిషన్స్ పెట్టి ఇబ్బంది పెడుతోందనే పుకార్లు ఆమెని బాధించాయట. అందుకే రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే ప్రేమ్ కుమార్ ని కలిశానని…కథ మార్చమని కానీ, తన పాత్ర పెంచమని కానీ అతడిని అడగలేదని…కావాలనే తనపై ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని ఫైర్‌ అయింది. ప్రస్తుతం చైతు, సామ్ కలిసి నటించిన చిత్రం మజిలీ ఏప్రిల్ 5న విడుదల అవ్వబోతుంది.

Tags:    

Similar News