నెటిజన్లకు సమంత కౌంటర్..!

అక్కినేని కోడలు సమంత సినిమాలతో బిజీగా ఉంటూనే కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. లేటెస్ట్ గా ఆమె ‘కుర్ కురే’ ప్రొడక్ట్ కి [more]

Update: 2019-03-14 08:21 GMT

అక్కినేని కోడలు సమంత సినిమాలతో బిజీగా ఉంటూనే కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. లేటెస్ట్ గా ఆమె ‘కుర్ కురే’ ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టు ట్వీట్ చేసింది. ఆమె అలా ట్వీట్ చేసిందో లేదో వెంటనే ఆమెను నెటిజన్లు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ‘కుర్ కురే’ ఆరోగ్యానికి హానికరం అని, దాన్ని మీరు ఎలా ప్రమోట్ చేస్తారని.. డబ్బు కోసం ఏదైనా చేస్తారా అని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు సామ్ లాంటి యాక్టర్స్ ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూ… అందంగా, ఫిట్‌గా ఉంటారు కానీ మనల్ని మాత్రం ఇలా ఆనారోగ్యానికి పడేసే జంక్ ఫుడ్ తినాలని ప్రోత్సహిస్తున్నారు అని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

నేను కూడా అవి తింటాను…

అసలు సమంత ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్యాకెట్ అయినా పూర్తిగా తింటుందా? అని అంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న సామ్ వీటిపై తన ట్విట్టర్ ద్వారా బదులిస్తూ… “నేను కూడా వాటిని తింటాను… అందుకే ప్రమోట్ చేస్తున్నాను. ఆదివారం పూట నేను తినే లంచ్ ఫోటోలు మీకు పంపుతాను. నాకు బోర్ కొట్టినప్పుడల్లా నేను తినేది ఇదే’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్ నటించిన మజిలీ చిత్రం వచ్చేనెల ఏప్రిల్ 5న విడుదల అవ్వబోతుంది .

Tags:    

Similar News