రామలక్ష్మి యమా హాట్ గురూ!

Update: 2018-04-10 08:50 GMT

రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన తర్వాత అంత స్థాయిలో పేరొచ్చింది మాత్రం రామలక్ష్మి పాత్ర చేసిన సమంత కి. రామలక్ష్మి లా సమంత పల్లెటూరి అమ్మాయిలా లంగావోణీ వేసుకుని చిలిపి పిల్లలా... పొలం పనులు చేసుకునే అమ్మాయిలా అత్యంత అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక సినిమా విడుదలకు ముందే ఎంతగా రంగస్థలం టీమ్ రంగస్థలం గురించి ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ చేసిందో.. సినిమా విడుదలై సక్సెస్ కొట్టాక కూడా అంతే... ప్రమోషన్స్ తో హోరెత్తించింది. అయితే సినిమా విడుదలకు ముందు చిన్నగా కొన్ని ఇంటర్వూస్ ఇచ్చిన రామలక్ష్మి భర్త తో కలిసి విదేశాలకు చెక్కేసింది. సినిమా విడుదలయ్యాక 10 రోజుల వరకు పాప ఎవ్వరికి కనబలేదు.

కానీ అఖిల్ బర్త్ డే పార్టీ కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రామలక్ష్మి ఉరఫ్ సమంత రంగస్థలం సినిమా కోసం సుకుమార్ గారు చేసిన ఇంటర్వ్యూలో హల్చల్ చేసింది. సుకుమార్ గారు అడిగిన ప్రశ్నలకు ఎంతో చిలిపిగా... కిలకిలా మంటూ నవ్వుతూ సమాధానాలు చెప్పిన సమంత పిచ్చ హాట్ గా దర్శనమిచ్చింది. మాములుగా సమంత హాట్ గానే, గ్లామర్ డ్రెస్సుల్లోనే అందరికి దర్శనమిస్తుంది. కానీ రంగస్థలంలోని రామలక్ష్మి పాత్రలో సమంత డి గ్లామరస్ గా అదరగొట్టేసింది. కానీ ప్రమోషన్స్ లో మాత్రం హాట్ హాట్ డ్రెస్సులతోను గ్లామర్ షో చేస్తుంది. స్లీవ్ లెస్ గౌన్ తో క్లివేజ్ షోతో... మోకాళ్ళదాకా ఓపెన్ గా వున్న ఆ ఫ్రొక్ లో సమంత ని చూస్తే.. రామలక్ష్మి యమా హాట్ గురూ అని అనకుండా ఉండలేరు సుమీ.

నాగ చైతన్య తో పెళ్ళయాక హాట్ డోస్ పెంచిన సమంత నటించిన మహానటి సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. తమిళంలో నటించిన సినిమాలు కూడా విడుదలవ్వాల్సి ఉంది.

Similar News