మళ్లీ రామలక్ష్మి వచ్చేస్తుందోచ్!

Update: 2018-07-27 08:13 GMT

అదేమిటీ రంగస్థలం విడుదలై చాలా రోజులైంది.. మళ్లీ రామలక్ష్మి రావడమేమిటని అనుకుంటున్నారా..? అవునండి రంగస్థలం రామలక్ష్మి మరోసారి తన రామలక్ష్మి లుక్ లో దర్శనమీయబోతుంది. ఎందులో అంటారా.. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సీమరాజా అనే సినిమాలో సమంత మరోసారి రామలక్ష్మి గెటప్ లో కనబడబోతుంది. మరి రంగస్థలంలో డీగ్లామరస్ గా లంగావోణీ తో గడుసుదనంతో కూడిన అమాయకపు పల్లెటూరి అమ్మాయిలా పోలం పనులు చేస్తూ చిట్టిబాబు ఉరఫ్ రామ్ చరణ్ చుట్టూ తిరిగే అమ్మాయిలా సమంత నటన అద్భుతం అని చెప్పాలి. మరి రంగస్థలంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ కి ఎంత పేరొచ్చిందో.... రామలక్ష్మి గా సమంత కి అంతే పేరొచ్చింది.

వరుస హిట్లతో...

మరీ మల్లీ రామలక్ష్మి లాంటి పాత్ర కాదుగాని కాస్త గ్లామర్ గా అంటే కాస్త మేకప్ తో లంగావోణీ గెటప్ లో సమంత సీమరాజా లో శివ కార్తికేయన్ కి జోడిగా కనబడబోతుంది. మరి ఈ ఏడాది రామలక్ష్మిగా... రంగస్థలంలో, మహానటిలో మధురవాణిగా, అభిమన్యుడిలో సైకియాట్రిస్ట్ గా సమంత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. తాజాగా తనకెంత ఇష్టమైన యూటర్న్ సినిమాలోనూ సమంత లుక్ ఆసక్తిగా కనబడుతుంది. జర్నలిస్ట్ పాత్రలో చెయ్యబోతున్న సమంత యూటర్న్ లుక్ కాస్త డిఫరెంట్ గా కనబడుతుంది. మరి ఈ సినిమాతోనూ సమంత హిట్ కొట్టడం ఖాయమైయ్యేలానే కనబడుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కాబోతుంది.

పెళ్లి తర్వాత బాగానే కలిసివస్తోంది

ఇక ప్రస్తుతం సీమరాజా సినిమాలోని సమంత లుక్ బయటికి వచ్చింది. ఆ ఫోటోలో సమంత లంగాఓణిలో వయ్యారంగా కనబడుతుంది. కాస్త క్లాసీగా తన భుజంపై వాలిన పావురాన్ని అందంగా చూస్తూ కనబడుతున్న సమంత ఈ లుక్ లోనూ అదరగొట్టేస్తుంది. మరి గ్లామర్ పరంగా ఎక్కడా తగ్గని సమంత ఇలాంటి గ్లామర్ లెస్ పాత్రలను అదరగొట్టేస్తుంది. ఏది ఏమైనా సమంతకి నాగ చైతన్యతో పెళ్లి బాగా కలిసొచ్చింది. పెళ్లి తర్వాత సమంత సినిమాలన్నీ వరసగా హిట్ అవుతున్నాయి.

Similar News