ఎంత సక్కగున్నావే.. !!

రంగస్థలం లో రామలక్ష్మి అదేనండి సమంత ని చూసి మన చిట్టిబాబు రామ్ చరణ్ ఎంత సక్కగున్నావే అంటూ పాటందుకున్నట్టుగా అక్కినేని వారి కోడలు సమంత లేటెస్ట్ [more]

Update: 2020-09-12 04:46 GMT

రంగస్థలం లో రామలక్ష్మి అదేనండి సమంత ని చూసి మన చిట్టిబాబు రామ్ చరణ్ ఎంత సక్కగున్నావే అంటూ పాటందుకున్నట్టుగా అక్కినేని వారి కోడలు సమంత లేటెస్ట్ పిక్ చూస్తుంటే అలా పాటందుకోవాలనిపిస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ లో సేంద్రియ పద్దతుల ద్వారా కూరగాయలు పండిస్తున్న సమంత తాజాగా బాలీవుడ్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. అలాగే సినిమా  షూటింగ్స్ కి సమాయత్తమవుతున్న సమంత తాజాగా హాష్ అక్కినేని తో కూల్ గా దిగిన ఫోటో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

సోఫా మీద పడుకుని హాష్ (కుక్కపిల్ల) తో ఎంజాయ్ చేస్తున్న సమంత రివర్స్ లో తీసిన పిక్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. సమంత పెళ్లి తర్వాత పాత్రకి, కథకి ప్రాధాన్యమున్న సినిమాలనే ఒప్పుకుంటూ తనకంటూ ఓ స్పెషల్ కేటగిరి దర్శకనిర్మాతలకు కండిషన్స్ పెడుతున్న సమంత మాత్రం బయట గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. చాలా సన్నగా నాజూగ్గా గ్లామర్ గా కనబడుతున్న సమంత జంతు ప్రేమికురాలు కూడా. తాజాగా ఓ జంతు ప్రేమికురాలు ఓ వీడియో షేర్ చేసింది. ఒక యజమాని ఆవు ని అమ్మేస్తే.. దానిని కొన్నవ్యక్తి  ఆటో లో ఆవుని తీసుకెళుతుంటే.. ఎన్నాళ్ళ నుండో ఆవుతో కలిసి ఉన్న ఓ ఎద్దు ఆవుని వదల్లేక ఆటో వెంబడి పరుగుపెడుతూ తన ప్రేమని తెలియజేసే వీడియో షేర్ చెయ్యగా దానిని సమంత కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి జంతు ప్రేమికురాలని మరోసారి నిరూపించుకుంది. 

Tags:    

Similar News