ఒక టైం లో సినిమాలకు బై బై చెప్పేద్దామనుకున్నా!

Update: 2018-04-25 08:56 GMT

అక్కినేని సమంత పెళ్లి తర్వాత వరస సినిమాలతో బిజీగా అయిపోయింది. లేటెస్ట్ గా ఆమె నటించిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇక సామ్ తర్వాత సినిమా మహానటి కూడా రిలీజ్ కి రెడీ అయింది. లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సమంత వ్యక్తిగత జీవితంతో పాటు నటననూ ఆస్వాదిస్తున్నానని చెప్పింది.

ఒక టైమ్ లో సినిమాలు, నటనకు గుడ్ బై చెప్పేదాం అనుకున్న. కానీ నా వద్దకు ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ రావడంతో... సినిమాలు మానేద్దామనే ఆలోచన మనుకున్నా. ఇంట్రెస్టింగ్ పాత్రలతో ఉన్న స్క్రిప్ట్స్ నా దగ్గరకు వస్తుంటే చాలా ఉత్సాహంగా ఉన్నానని..ఒకప్పుడు హిట్ సినిమాల్లో నటించినా, వాటిని ఆస్వాదించలేని పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడ్డానని వెల్లడించింది.

అలానే నేను ఎటువంటి సినిమాలు చేసిన నా ఫ్యాన్స్ ఆ సినిమాలని ఆదరిస్తున్నారని.. ఆ ఆదరణ తనకెంతో ధైర్యాన్నిస్తోందని చెప్పుకొచ్చింది సామ్.

Similar News