శూర్పణఖ గా సమంత..?

Update: 2018-10-23 06:23 GMT

ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు హీరోల పక్కన కూడా నటిస్తున్న టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత ఇప్పుడు మరో లేడి ఓరియెంటెడ్ మూవీ కి ఓకే చేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇప్పటికే యూటర్న్ తో హిట్ కొట్టిన సమంత ఇప్పుడు నందిని రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాని, నాగ చైతన్యతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తుంది. ఇక దిల్ రాజు బ్యానర్ లో నానితో కలిసి తమిళ 96 రీమేక్ లో నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పుడు రామాయణంలో ఎంతో కీలక పాత్ర అయిన శూర్పణఖ పాత్రని సమంత పోషించబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. రామాయణంలో రామ – రావణ యుద్ధానికి కారణమైన శూర్పణఖ పాత్రను హైలెట్ చేస్తూ యానిమేషన్ డైరెక్టర్ భార్గవ్ ఒక సినిమా చేయబోతున్నానని ఎప్పుడో ప్రకటించాడు.

అందమైన యువరాణిగా...

అయితే ఈ శూర్పణఖ పాత్రకు భార్గవ్ ముందుగా కాజల్ అగర్వాల్ ని అనుకోగా.. కాజల్ ఇప్పుడు తేజ సినిమాతో బిజీగా ఉండడంతో భార్గవ్ సమంత ని సంప్రదించినట్టుగా వార్తలొస్తున్నాయి. మాములుగా శూర్పణఖ అంటే అందరికి ఒక రాక్షసిగానే తెలుసు. కానీ ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. శూర్పణక ఓ అందమైన యువరాణి... అని ఈ సినిమాలో శూర్పణక గురించి ఎవరకీ తెలియని విషయాలు కూడా దర్శకుడు చూపించనున్నారు అని తెలుస్తుంది. ఇక లేడి ఓరియెంటెడ్, ప్రాధాన్యం ఉన్న పాత్రలకు సై అంటున్న సమంత ఈ సినిమా చేసేందుకు మొగ్గు చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబందించిన అనేక విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Similar News