ఇది సమంతకు సొంతం అన్నట్టుగా లేదు

Update: 2018-04-24 04:47 GMT

గత ఏడాది అసలు సమంత సినిమాలు చేస్తుందా.. అన్నట్టుగా ఉంది సమంత వ్యవహారం. ఎందుకంటే నాగ చైతన్య తో ప్రేమ వ్యవహారం తెలిసినాక ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలెవరు సాహసం చెయ్యలేదు. ఇక సమంత కెరీర్ అయిపోయింది అన్న తరుణంలో సుకుమార్, రామ్ చరణ్ తో కలిసి రంగస్థలంలో నటించే అవకాశం ఇవ్వడం.. తర్వాత మహానటి సినిమాలోనూ సమంతకు కీలక పాత్ర రావడం అటుంచి తమిళంలో మాత్రం సమంత టాప్ రేంజ్ లో సినిమాలు చేసేస్తూ బిజీగా మారిపోయింది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాల మీది సినిమాల ఒప్పుకుంటూ హానీమూన్ కి కూడా వెళ్లకుండా షూటింగ్ లకు హాజరైన సమంత రంగస్థలంతో అనుకున్న ఫలితాన్ని అందుకుంది.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సమంత నటించిన మహానటి మూవీ కూడా వచ్చేనెల తొమ్మిదినె విడుదలవుతుంది. ఈ సినిమాలో మధురవాణిగా సమంత నటిస్తుంది. అయితే గత నెలన్నర నుండి తమిళ సినిమాలు విడుదల చెయ్యకుండా బంద్ చేస్తున్న నిర్మాతలు ప్రస్తుతం తమ సినిమాలను ఒక్కొక్కటిగా థియేటర్స్ లోకి దింపుతున్నారు. అయితే గత జనవరిలోనే సమంత - విశాల్ లు కలిసి నటించిన ఇరుంబుతురై విడుదలకావాల్సి ఉంది. ఇరుంబుతురై ని తెలుగులో అభిమన్యుడు పేరుతొ విడుదల చేస్తున్నారు. అయితే అపుడు వాయిదా పడిన ఈ సినిమా తమిళనాట మే 11 న విడుదలకబోతుంది.

మరి సమంత నటించిన రెండు సినిమాలు ఇలా తెలుగు తమిళంలో రెండ్రోజుల గ్యాప్ లో విడుదలకు కావడం మాత్రం ఆమెకు రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. మహానటి, అభిమన్యుడు రెండు సినిమాలు రెండు భాషల్లోనూ రెండ్రోజుల తేడాతో విడుదల కాబోతున్నాయి.అలాగే తమిళనాట సమంత నటించిన మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధం కాబోతున్నాయి.ఇటు తెలుగులోనూ సమంత యూ-టర్న్ సినిమాని చెయ్యడంతో పాటుగా తన భర్త తో కలిసి శివ నిర్వాణం డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలోనూ నటిస్తుంది.

Similar News