నానితో సమంత మూడో సినిమా..?

Update: 2018-09-29 06:56 GMT

నాని - సమంత కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'ఈగ'. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాని పాత్ర చాలా తక్కువ సేపు ఉంటుంది. 30 నిముషాల లోపే తన పాత్ర ఉంటుంది. ఫుల్ లెంగ్త్ పాత్రలో సమంత కనిపించింది. అది సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో 'ఏటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా వచ్చింది. ఇందులో నాని చివరి దాకా ఉంటాడు. త్రీ జెనరేషన్స్ లో ఇద్దరు కనిపిస్తారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ రెండు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

96 రీమేక్ లో...

అయితే తాజా సమాచారం ప్రకారం ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ జంటగా నటించనున్నారని సమాచారం. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా ’96’ రూపొందింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొన్నారు. అయితే తెలుగులో నాని, సమంత జంటగా ‘96’ని రీమేక్ చేయాలని రాజు భావిస్తున్నట్టు సమాచారం. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని టాక్. ప్రస్తుతం హాలిడే లో ఉన్న సామ్ తిరిగి రాగానే 'మజిలీ' సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననుంది. ఈ సినిమా తర్వాత ‘96’ రీమేక్ లో నటించే అవకాశం ఉంది. త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని టాక్.

Similar News