మన్మధుడు 2లో మామాకోడళ్ల గోల..!

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మధుడు 2 సినిమా పట్టాలెక్కేసింది. గతంలో నాగార్జున – సోనాలి బింద్రే జంటగా తెరకెక్కిన [more]

Update: 2019-04-03 07:41 GMT

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మధుడు 2 సినిమా పట్టాలెక్కేసింది. గతంలో నాగార్జున – సోనాలి బింద్రే జంటగా తెరకెక్కిన మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నాగార్జున మళ్లీ అదే నమ్మకంతో ఇప్పుడు చి.ల.సౌ ఫేమ్ రాహుల్ తో మన్మధుడు 2ని మొదలు పెట్టడం, రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడం కూడా జరిగింది. తాజాగా మన్మధుడు 2 వర్కింగ్ ఫొటోస్ ని నాగ్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. మా మన్మధుడు ఫ్యామిలీ అంటూ అందరినీ పరిచయం చేసాడు. అందులో వెన్నెల కిషోర్ ఇంకా ముఖ్యమైన నటీనటులు ఉన్నారు.

నటించనున్న సమంత

తాజాగా మన్మధుడు 2లో నాగ్ కోడలు సమంత కూడా నటిస్తుందని టాక్ వినబడుతుంది. సమంత ఒక గెస్ట్ రోల్ చేయబోతోందని.. మామ నాగార్జున, ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ కోసం ఆ రోల్ ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే మజిలీ సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్న సమంత… నందినీరెడ్డి మిస్ గ్రానీ లో, దిల్ రాజు తమిళ రీమేక్ 96 లో నటిస్తుంది. తాజాగా మామ కోసం ఈ స్పెషల్ రోల్ కూడా చేయబోతుంది. మరి మన్మధుడు 2 లో మామాకోడళ్ల రచ్చ ఏ లెవెల్లో ఉంటుందో చూద్దాం.

Tags:    

Similar News