మళ్ళీ హిట్ కొట్టడానికి తయారవుతున్నారు

పెళ్లికి ముందు ఇద్దరు కలిసి నటిస్తే… ఆ క్రేజ్ మాములుగా ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత ఆ జంట గనక సినిమాలో కలిసి కనబడితే.. ప్రేక్షకులకు కన్నుల [more]

Update: 2019-04-28 05:04 GMT

పెళ్లికి ముందు ఇద్దరు కలిసి నటిస్తే… ఆ క్రేజ్ మాములుగా ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత ఆ జంట గనక సినిమాలో కలిసి కనబడితే.. ప్రేక్షకులకు కన్నుల పండుగే. మరి అలా సినిమాల్లో కలిసి కనబడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన జంట ఎవరో కాదు.. టాలీవుడ్ కపుల్ నాగ చైతన్య – సమంతలు. పెళ్ళికి ముందు మూడు సినిమాలు. అందులో రెండు హిట్స్. ఒకటి ప్లాప్. పెళ్లి తర్వాత ఒక సినిమాలో కలిసి నటిస్తే.. ఆ సినిమా సూపర్ హిట్. రీసెంట్ గా మజిలీ సినిమాలో చైతు -సామ్ లు కలిసి నటించారు. ఆ సినిమాని ప్రేక్షకుల ఏ రేంజ్ లో ఆదరించారో… ఆ సినిమా కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది.

ఇక మరోమారు ఆ జంట కలిసి నటిస్తే.. ఆసినిమాకి ఆటోమాటిక్ గా భారీ క్రేజ్ రావడం ఖాయం. మజిలీ సినిమా మొదలైనప్పుడే చైతు – సామ్ జంటగా నటిస్తుంది అంటే.. ఆ సినిమాకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. మరి తాజాగా చైతు సమంత ల జంట మరో మూవీలో కలిసి నటించబోతున్నారనే న్యూస్ ఈమధ్యకాలంలో వినబడుతుంది. అదికూడా RX 100 మూవీ డైరెక్టర్ సమంత అక్కినేని తో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడి కట్టించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అందుకే ఇప్పుడు చైతు తో సినిమా కోసం ట్రై చేస్తున్న అజయ్ భూపతి ఆ సినిమాలో మొదటినుండి అనుకున్నట్లుగా సమంత నే హీరోయిన్ గా తీసుకోబోతున్నాడట. ఇక మహాసముద్రం టైటిల్ తో చైతు తో అజయ్ తియ్యబోయే సినిమాలో నాగ చైతన్య పోలీసాఫీసర్ గా కనిపిస్తాడట. ఇక మహాసముద్రం టైటిల్ లో మహా అనేది హీరోయిన్ పేరట. ఇక ఆ మహా కేరెక్టర్ కి సమంత అయితే బావుంటుందని చెప్పాడట. మహాసముద్రం సినిమా కూడా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుండడంతో….ఆ బలమైన పాత్ర సమంత చేస్తేనే బావుంటుందని డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. మరి ఎలాగూ మజిలీ తో సూపర్ హిట్ కొట్టిన చైతు- సామ్ లు మరోసారి ప్రేక్షకుల కోసం నటించడం ఖాయమనే మాట వినబడుతుంది.

Tags:    

Similar News