చిన్న సినిమాతో పోటీ పడుతున్న పెద్ద సినిమా ఇదే!

మారుతీ దర్శకత్వ పర్వవేక్షణ లో 2013 లో వచ్చిన ‘ప్రేమ కథా చిత్రం’ లో సుధీర్ బాబు – నందిత శ్వేతా జంటగా నటించారు. కరెక్ట్ గా [more]

Update: 2019-03-24 10:58 GMT

మారుతీ దర్శకత్వ పర్వవేక్షణ లో 2013 లో వచ్చిన ‘ప్రేమ కథా చిత్రం’ లో సుధీర్ బాబు – నందిత శ్వేతా జంటగా నటించారు. కరెక్ట్ గా ఏడాదికి ఈ సినిమా సీక్వెల్ రానున్నది. అయితే ఈసారి మొదటి భాగంలో పని చేసిన ఎవరూ ఇందులో పని చేయడం లేదు. అంత కొత్త వాళ్ళే.

యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నందిత శ్వేతా, సిద్ది ఇద్నాని లు హీరోయిన్లు గా తెరకెక్కిన ఈచిత్రాన్ని మొదటి భాగాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థే ఈ భాగాన్ని నిర్మిస్తుంది. మార్చి నెల లో ఈ సినిమాని రిలీజ్ చేద్దాం ప్లాన్ చేసారు. కానీ కొన్ని అనుకోని కారణాలు వల్ల ఈమూవీ ని ఏప్రిల్ నెలకు షిఫ్ట్ చేసారు.

ఏప్రిల్ 6 న ఉగాది పండుగని పురస్కరించుకొని ఈ సినిమా ని రిలీజ్ చేస్తున్నారు. దానికి ముందు రోజు అంటే ఏప్రిల్ 5 న నాగ చైతన్య – సమంత నటించిన మజిలీ రిలీజ్ అవుతుంది. సో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం ఏది సక్సెస్ అవుతుందో..

Tags:    

Similar News