బాహుబలితో రామలక్ష్మి..!

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో అమ్మాయిల గుండెల్లో స్థానాన్ని సంపాదించిన ఆరడుగుల అందగాడు ప్రభాస్ బాహుబలితో ప్రపంచాన్నే చుట్టేశాడు. మరి బాహుబలితో తన క్రేజ్ [more]

Update: 2019-04-02 07:20 GMT

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో అమ్మాయిల గుండెల్లో స్థానాన్ని సంపాదించిన ఆరడుగుల అందగాడు ప్రభాస్ బాహుబలితో ప్రపంచాన్నే చుట్టేశాడు. మరి బాహుబలితో తన క్రేజ్ ని ఎల్లలు దాటించిన ప్రభాస్.. ఇప్పుడు సాహో సినిమాతో, రాధాకృష్ణ సినిమా(జాన్ టైటిల్ పరిశీలనలో ఉంది)తోనూ నేషనల్ వైడ్ గా మళ్లీ ఫోకస్ కావడమే కాదు ఇక ప్రభాస్ రేంజ్ ఇండియా వైడ్ గానే ఉంటుందని ఈ రెండు సినిమాలతోనూ ఫిక్స్ అయ్యింది. అలాంటి ప్రభాస్ పక్కన ఏ హీరోయిన్ కి అవకాశమొచ్చినా అస్సలు వదులుకోరు. సాహో సినిమా, రాధాకృష్ణతో చెయ్యబోయే సినిమాల తరువాత ప్రభాస్ దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నాడని ఫిలింనగర్ టాక్.

సమంతకు క్రేజ్ ఉండటంతో

ఒక క్రేజీ డైరెక్టర్ తో కథను సిద్ధం చేయిస్తోన్న దిల్ రాజు… ఆ సినిమా లో ప్రభాస్ కి జోడిగా సమంతని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పెళ్లి తర్వాత కూడా దూసుకుపోతున్న సమంత క్రేజ్ తెలుగు, తమిళంలో సూపర్ గా ఉంది. దిల్ రాజు ప్రభాస్ తో చెయ్యబోయే చిత్రాన్ని తెలుగు, తమిళంలోనూ తెరకెక్కిస్తాడని.. అందుకే రెండు భాషల్లో విపరీతమైన క్రేజున్న హీరోయిన్ సమంత అయితే ప్రభాస్ పక్కన సూట్ అవుతుందని దిల్ రాజు భావిస్తున్నాడట. ప్రస్తుతం సమంత తెలుగులో మజిలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే నందినిరెడ్డితో ఒక మూవీ, దిల్ రాజు బ్యానర్ లో 96 రీమేక్ లో నటించనుంది. ఇక తమిళనాట సూపర్ డీలక్స్ తో సూపర్ సక్సెస్ అందుకుంది సామ్. ఆ సినిమాలో సామ్ నటనను విమర్శకులు కూడా పొగిడేస్తున్నారు. మరి అలాంటి క్రేజ్ ఉన్న సమంత బాహుబలితో నటిస్తే గనక ఆ సినిమా మీద భారీ అంచనాలే వచ్చేస్తాయి. ఇప్పటివరకు ప్రభాస్ – సమంత జోడి తెర మీద కనబడలేదు. ఇక బాహుబలితో రంగస్థలం రామలక్ష్మి కాంబో ఉంటుందో లేదో అనేది దిల్ రాజు మీద ఆధారపడి ఉంది.

Tags:    

Similar News