మార్ఫింగ్ ఫోటోలు చూసి షాకైన సమంత

Update: 2018-07-30 09:01 GMT

ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు అందరికీ చేరువయ్యాయి. దీంతో సోషల్ మీడియా కూడా విస్తృతమైంది. అయితే, సోషల్ మీడియా వేదికగా కొందరు చేసే పనులు మాత్రం హాస్యాస్పదంగా, మరొకొన్ని వివాదాస్పదంగా ఉంటాయి. కొందరు నటీనటుల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తుంటారు. సరిగ్గా ఇదే అనుభవం అక్కినేని వారి కోడలు సమంతకు కూడా ఎదురైంది. సమంత పెళ్లికూతురిగా ఉన్న ఫోటోలో నాగచైతన్య ఉండాలి. కానీ, ఓ వ్యక్తి ఫోటోను మార్ఫింగ్ చేసి నాగచైతన్య స్థానంలో తన ఫోటో పెట్టుకోవడం నవ్వు పుట్టిస్తుంది. ఈ ఫోటో ట్విట్టర్ లో సమంతకు కూడా చేరింది. అయితే, ఆమె దీనిని వివాదాస్పదం చేయకుండా ఒక జోక్ గా తీసుకుంటూ ట్వీట్ చేసింది.

 

 

Similar News