సమంత కూడా…!!

నాగ చైతన్య పుట్టిన రోజునాడు భర్త తో కలిసి సమంత ఇప్పుడు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. ఈమధ్యన కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీస్ లో [more]

Update: 2020-11-23 08:58 GMT

నాగ చైతన్య పుట్టిన రోజునాడు భర్త తో కలిసి సమంత ఇప్పుడు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. ఈమధ్యన కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీస్ లో హీరోస్ అందరూ దుబాయ్ ట్రిప్ కి ఫామిలీస్ ని తీసుకుపోతుంటే.. హీరోయిన్స్ మాత్రం మాల్దీవులకు చెక్కేస్తున్నట్టుగానే టాప్ హీరోయిన్ సమంత కూడా భర్త నాగ చైతన్య తో కలిసి మాల్దీవులకు వెళ్ళిపోయింది. మొన్నామధ్యన సైనా నెహ్వాల్, కాజల్ అగర్వాల్ హాని మూన్ ట్రిప్, అలాగే నిన్న రకుల్ మాల్దీవులు అందాలే కాకుండా బాలీవుడ్ భామలతోను మాల్దీవులు కళకళలాడుతుంటే ఇప్పుడు సమంత, భర్త చైతు అక్కడ మాల్దీవుల్లో చైతు బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

మాల్దీవులకు సెలబ్రిటీస్ అంటూ ఈ మధ్యన సోషల్ మీడియాలో తెగ హోరెత్తుతోంది. అక్కడ బీచ్ అందాలను తిలకిస్తూ బికినీ షోస్ చేస్తున్న హీరోయిన్స్ కి పోటీగా సమంత కూడా మాల్దీవుల్లో హాట్ హాట్ ఫోజులకి బదులు స్కూబా డైవింగ్ లాంటివి చేస్తుంది. ప్రస్తుతం సమంత మాల్దీవులు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సముద్రం వైపు తిరిగి సముద్రపు అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్న సమంత బ్యాక్ ఫొటోస్ తో పాటుగా స్కూబా డైవింగ్ కి సమంత ప్రిపేర్ అవుతున్న ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News