కత్తిలాంటి ఫోజు

లాక్ డౌన్ టైం లో హీరోయిన్స్ అంతా వంటలు, వర్కౌట్స్ చేస్తే.. సమంత మాత్రం యోగ, వర్కౌట్స్ చేస్తూనే మిద్దె మీద కూరగాయలు పండించి సత్తా చాటింది. [more]

Update: 2020-09-16 03:15 GMT

లాక్ డౌన్ టైం లో హీరోయిన్స్ అంతా వంటలు, వర్కౌట్స్ చేస్తే.. సమంత మాత్రం యోగ, వర్కౌట్స్ చేస్తూనే మిద్దె మీద కూరగాయలు పండించి సత్తా చాటింది. ఇక మెల్లిగా షూటింగ్స్ మొదలవుతున్న టైం లోనే తాను నటించిన హిందీ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 కి డబ్బింగ్ కూడా చెప్పిన సమంత ఇప్పుడు షూటింగ్స్ కి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే టాక్ నడుస్తుంది. మామ నాగార్జున బిగ్ బాస్ బుల్లితెర షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. తర్వాత నాగ చైతన్య కూడా శేఖర్ కమ్ముల తో లవ్ స్టోరీ సెట్స్ మీదకెళ్ళాడు. ఇక తాజాగా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా పట్టాలెక్కేసింది. మరి ఇంట్లో అంత షూటింగ్స్ అంటూ హడావిడి చేస్తున్న సమంత మాత్రం షూటింగ్ కి ప్రిపేర్ అవడం లేదట.

కానీ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గానే ఉంటుంది సామ్. ఈమధ్యన హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుని సమంత ఆ పిక్స్ ని ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పెళ్లయిపోయింది.. అయినా గ్లామర్ రసం తగ్గించని సమంత లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే కత్తిలా ఉంది ఫిగరు అని అంటూ సమంతని మోసెయ్యడం ఖాయం. తల వెనుక రెండు చేతులు పెట్టుకుని.. ఫేస్ మీద కూల్ ఎక్సప్రెషన్స్ తో సమంత ఇచ్చిన హాటెస్ట్ ఫోజు చూసిన ఎవ్వరికైనా గుండె గుబేల్ మంటుంది. కిర్రాక్ ఫోజుతో యూత్ ని పడేస్తున్న సమంత షూటింగ్స్ కోసం ఎప్పుడు తయారవుతుందో మరి.

Tags:    

Similar News