దిల్ రాజు వదిలేసాడా?

ఈమధ్యన దిల్ రాజు తానూ నిర్మిస్తున్న సినిమాలను సరిగ్గా పట్టించుకోవడం లేదనే అపవాదు ఉంది. ఎందుకంటే డిసెంబర్ లో విడుదలైన రాజ్ తరుణ్ ఇద్దరిలోకం ఒక్కటే సినిమా [more]

Update: 2020-02-12 03:39 GMT

ఈమధ్యన దిల్ రాజు తానూ నిర్మిస్తున్న సినిమాలను సరిగ్గా పట్టించుకోవడం లేదనే అపవాదు ఉంది. ఎందుకంటే డిసెంబర్ లో విడుదలైన రాజ్ తరుణ్ ఇద్దరిలోకం ఒక్కటే సినిమా విషయంలో దిల్ రాజు అస్సలు పట్టించుకున్న పాపాన లేదు. అసలు ఆ సినిమా ముందే పోతుంది అని గ్రహించినట్లుగా పెద్దగా ప్రమోషన్స్ చెయ్యలేదు. అంతేకాకుండా ఎంతో ఇష్టపడి 96 రీమేక్ రైట్స్ అసలు కన్నా 25 లక్షలు ఎక్కువ ఇచ్చి మరీ కొనుకున్న జాను సినిమా విషయంలోనూ దిల్ రాజు అలానే ప్రవర్తించాడు. జాను సినిమా విడుదల ముందు వరకు నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ గా ఉంది.. విడుదలకు వారం ముందు నుండి హడావిడి చేసాడు.

అలాగే విడుదల తర్వాత థాంక్స్ మీట్ అంటూ చేతులు దులిపేసుకున్నాడనిపిస్తుంది. ఎంతో క్రేజ్ తో విడుదలైన జాను సినిమాకి ఫస్ట్ వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 5.82 కోట్లు కొల్లగొట్టగా.. వరల్డ్ వైడ్ గా 6.61 కోట్లు కొల్లగొట్టింది. సమంత క్రేజ్ తో భీబత్సమైన కలెక్షన్స్ వస్తాయన్న బయ్యర్లకు.. జాను సినిమా దెబ్బేసింది. సమంత క్రేజ్ కూడా పనిచేయలేదు. కేవలం 96 ని చూసెయ్యడం, సినిమా స్లో నేరేషన్ సినిమాకి మెయిన్ మైనస్ అయినప్పటికీ.. అవే కలెక్షన్స్ ని శాసించే స్థాయికి కారణమా అవడం మాత్రం విడ్డురమే. కాకపోతే దిల్ రాజు కూడా తనవంతు ప్రమోషన్ సినిమాపై మొదటి నుండి గట్టిగా చేసినట్టయితే.. జాను కలెక్షన్స్ కళకళలాడేవి అంటున్నారు.

Tags:    

Similar News