మరోసారి ఆకట్టుకున్న సమంత..!

ప్రస్తుతం సమంత నటన గురించే టాప్ టాపిక్. కోలీవుడ్ మొత్తం సామ్ యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సరైన క్యారెక్టర్ పడాలే కానీ.. సమంత చెలరేగిపోతుందంతే. మరోసారి తానేంటో [more]

Update: 2019-03-30 12:05 GMT

ప్రస్తుతం సమంత నటన గురించే టాప్ టాపిక్. కోలీవుడ్ మొత్తం సామ్ యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సరైన క్యారెక్టర్ పడాలే కానీ.. సమంత చెలరేగిపోతుందంతే. మరోసారి తానేంటో నిరూపించుకుంది సామ్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సూపర్ డీలక్స్’ సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రలో నటించాడు. వేంబు అనే అమ్మాయి పాత్రలో సమంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని… విజయ్ నటన కూడా హైలైట్ గా నిలించింది క్రిటిక్స్ చెబుతున్నారు.

ఆరేళ్ల తర్వాత వచ్చి హిట్

త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘సూపర్ డీలక్స్’. ‘ఆరణ్యకాండం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాడు. టైం లేట్ అయినా మంచి సినిమా ఇచ్చాడని అంటున్నారు. ఇక వేశ్య పాత్రలో రమ్యకృష్ణ చేయడం విశేషం. అలానే మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఇందులో సమంతకు జోడీగా నటించాడు. త్వరలోనే ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు.

Tags:    

Similar News