సమంత పుష్పలోనా? అదంతా రూమరే!!

సుకుమార్ రంగస్థలం తర్వాత భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కరోనా లాక్ డౌన్ [more]

Update: 2020-07-04 06:11 GMT

సుకుమార్ రంగస్థలం తర్వాత భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కరోనా లాక్ డౌన్ లేకపోతె ఈపాటికి సెట్స్ మీద ఉండేది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక డీ గ్లామరస్ గాను, రాయలసీమ భాష మాట్లాడే అమ్మాయిగాను నటించబోతుంది. ఇక బన్నీ లారీ డ్రైవర్ గా పక్కా ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. బన్నీ పుష్ప ఫస్ట్ లుక్ తోనే అందనంత క్రేజ్ సంపాదించాడు.

అయితే ఈ రష్మిక మందన్న ని హీరోయిన్ గా అనుకోకముందు.. హీరోయిన్ ఆఫర్ రంగస్థలంలో రామలక్ష్మి గా డీ గ్లామర్ రోల్ లో అదరగొట్టిన సమంత కి వచ్చిందట. సుకుమార్ పుష్ప లో సమంత అయితే డీ గ్లామర్ రోల్ తో రాయలసీమ భాషతో అదరగొడుతుంది అని భావించి సమంత ని సంప్రదించడం, సమంత కూడా ఒకసారి అలంటి పాత్ర చేసి ఉన్నాను, అయినా ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కానీ, మరె ఇతర సినిమాలు కానీ ఒప్పుకోవడం లేదని… సుకుమార్ ఇచ్చిన భారీ ఆఫర్ ని తిరస్కరించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అసలు సుకుమార్ కోసం సమంతని సంప్రదించ లేదని… రంగస్థలంలో రామలక్ష్మి లా సమంత ని చూపించేసాక.. మళ్ళీ అలాంటి పాత్రలోనే చూపించడం ఎందుకు అని సుకుమార్ ప్రస్తుతం హిట్స్ మీదున్నా రశ్మికనే ముందు హీరోయిన్ గా అనుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే పుష్ప ఆఫర్ అసలు సమంత దగ్గరకు రాలేదన్నమాట.

Tags:    

Similar News