మొహం యవ్వనం... మనసు ముసలితనం!

Update: 2018-10-26 08:05 GMT

సమంత హాట్ అండ్ గ్లామర్ పాత్రలకు నో చెప్పకపోయినా... తాను ఒప్పుకునే పాత్రలో మాత్రం ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంది. సమంతలో పెళ్లి తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనబడుతుంది. రంగస్థలంలో రామలక్ష్మి కానివ్వండి, మహానటి లో మధురవాణి కానివ్వండి. యు- టర్న్ లో రచన కేరెక్టర్ కానివ్వండి. వేటికవి ప్రత్యేకమైన పాత్రలే. అయితే పెళ్ళైనా గ్లామర్ పరంగా కొద్దిగా కూడా తగ్గని సమంత స్టార్ హీరోల సినిమాలకు మాత్రం ఓకె చెప్పడం లేదు. ప్రస్తుతం నాగ చైతన్య తో శివ నిర్వాణ సినిమాతో పాటు నందిని రెడ్డి సినిమాని సమంత ఓకె చేసింది. సమంత ఓకె చేసిన నందిని రెడ్డి సినిమా కూడా లేడి ఓరియెంటెడ్ గానే ఉండబోతుంది.

కొరియన్ సినిమా ఆధారంగా...

రెండు మూడు సినిమాలు చేసిన నందిని రెడ్డి చాలా రోజుల నుండి సినిమాలు డైరెక్ట్ చేయడం లేదు. అయితే ప్రస్తుతం సమంత కీలక పాత్రలో ఒక కొరియన్ మూవీని ఆధారంగా చేసుకుని ఒక కథ రాసుకుంది. ఆ కథ ప్రకారం సమంత 60 ఏళ్ల బామ్మ పాత్రలో కనబడబోతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ కేరెక్టర్ లో సమంత ముఖం యవ్వనంగా అందంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం ముసలి తనపు ఛాయలతో ఉండబోతుందట. ఇక ఈ సినిమాలో సమంత కీలకపాత్ర కాగా... మరో రెండు హీరో పాత్రలు కూడా ఉన్నాయట. ఇప్పటికే నాగ శౌర్య ని ఒక హీరో పాత్రకి నందిని రెడ్డి ఎంపిక చేసిన సమాచారం ఉంది.

Similar News