సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనా..?

నాగ చైతన్య వరుస ఫ్లాప్స్ కి మజిలీ సినిమా బ్రేక్ వేసింది. మజిలీ సినిమాలో సమంత నటించడం వలన ఆ సినిమాకి బీభత్సమైన క్రేజ్ వచ్చిందనేది వేరే [more]

Update: 2019-05-04 06:56 GMT

నాగ చైతన్య వరుస ఫ్లాప్స్ కి మజిలీ సినిమా బ్రేక్ వేసింది. మజిలీ సినిమాలో సమంత నటించడం వలన ఆ సినిమాకి బీభత్సమైన క్రేజ్ వచ్చిందనేది వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సమంత మజిలీలో చైతు కోసమే నటించింది అనేది అందరికీ తెలిసిన సత్యం. శివ నిర్వాణ డైరెక్షన్ లో చైతు – సమంత జంటగా వచ్చిన మజిలీ సూపర్ హిట్ అయ్యింది. మజిలీ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉన్నారు అంటే అది కేవలం శ్రావణి క్యారెక్టర్ చేసిన సమంత కోసమే. మజిలీ సెకండ్ హాఫ్ లో సమంత శ్రావణి క్యారెక్టర్ లో జీవించింది. ప్రతి మహిళకు శ్రావణి క్యారెక్టర్ బాగా దగ్గరైంది. మూడు సినిమాల డిజాస్టర్స్ తో ఉన్న చైతుకి.. సమంత ఆ రకంగా హిట్ అందించింది.

ప్రత్యేకంగా పాత్ర సృష్టించి మరీ…

ఇక మామ నాగార్జున కోసం కూడా సమంత అప్పుడే రంగంలోకి దిగింది. ఆఫీసర్ డిజాస్టర్ తో ఉన్న నాగార్జున ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 చేస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్. కాగా ఈ సినిమాలో సమంత కూడా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నది అన్న విషయం తెలిసందే. అసలు మన్మధుడు 2లో సమంత కీరోల్ లేకపోయినా రాహుల్ ఆమె కోసం ఓ రోల్ ని సృష్టించాడట. నాగ్ తో సమంత నటించిన మనం, రాజుగారి గది 2 సినిమాలు హిట్ అవడంతో కాస్త సెంటిమెంట్ గా ఉంటుందని నాగ్ దర్శకుడు రాహుల్ కి సలహా ఇవ్వడంతో సమంత కోసం ఓ పాత్ర ని స్పెషల్ గా సృష్టించారట. ఎలాగూ ఆఫీసర్ సినిమాతో మర్కెట్ పడిపోయిన నాగార్జునకు ఇప్పుడు క్రేజ్ ఉన్న సమంత తోడైతే మన్మధుడు 2కి క్రేజ్ వస్తుందనేది కూడా సమంతని ఈ సినిమాలో తీసుకోవడానికి మరో కారణమట.

Tags:    

Similar News