మూడో సినిమాతో హ్యాట్రిక్ కొడుతుందా?

Update: 2018-05-11 06:49 GMT

హీరోయిన్స్ కి పెళ్లి అయిన తర్వాత మూవీస్ లో కష్టం అని చాలా మంది చెబుతుంటారు. కానీ అవిఏమి నిజం కాదని సమంత తన సినిమా రిజల్ట్ తో చెబుతుంది. తను నటించడం ద్వారా ఆ పాత్రలకు ఎంతో గుర్తింపు తీసుకువస్తోంది ఈ అక్కినేని వారి కోడలు.

లేటెస్ట్ గా రంగస్థలం.. మహానటి సినిమాల్లో రామలక్ష్మి..మధురవాణి పాత్రలతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఇవి రెండు పెళ్లి తర్వాత సాధించిన ఘనతలు. పెళ్లి తర్వాత హీరోయిన్ గా కొనసాగడం కష్టం అనుకునే ఫీలింగ్ ను బ్రేక్ చేసింది సామ్. తన పాత్రలతో గుర్తింపు సాధించడం సమంతకే సాధ్యం అని చెప్పవచ్చు.

అయితే మూడో సినిమాతో మనని అలరించటానికి మన ముందుకు వస్తుంది. విశాల్ హీరో గా వస్తున్నా ఇరుంబు తిరాయ్ అనే తమిళ్ మూవీ రేపే విడుదల కానుంది. తమిళనాడులో సుదీర్ఘంగా సాగిన సమ్మె తర్వాత వస్తున్న తొలి భారీ చిత్రం ఇదే అని చెప్పవచ్చు. కోలీవుడ్ లో రిలీజ్ అవ్వుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయ్. తెలుగులో అభిమన్యుడు అనే టైటిల్ తో వస్తున్నా ఈ చిత్రంకి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం సక్సెస్ ను అందుకుంటే.. సమంత హ్యాట్రిక్ కంప్లీట్ అయిపోతుంది.

Similar News