సమంత రేంజ్ మారింది కథలు మారుతున్నాయి!

మన సౌత్ హీరోయిన్స్ లో కమర్షియల్‌ హీరోయిన్ గా సక్సెస్ అవుతూ…పర్‌ఫార్మెన్స్‌ వైజ్ కూడా తమకు తిరుగు లేదని నిరూపించుకున్న హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉన్నారు. వీరిలో [more]

Update: 2019-06-22 08:20 GMT

మన సౌత్ హీరోయిన్స్ లో కమర్షియల్‌ హీరోయిన్ గా సక్సెస్ అవుతూ…పర్‌ఫార్మెన్స్‌ వైజ్ కూడా తమకు తిరుగు లేదని నిరూపించుకున్న హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉన్నారు. వీరిలో సమంత ఒక్కరు. ఇలా ఆమె రెండు విధాలుగా మెప్పిస్తుంది. సామ్ ను ప్రతిభావంతురాలు అనడంలో సందేహం లేదు.

ఆమె కామెడీ చేసినా చూసే జనాలు ఉన్నారు. ముఖ్యంగా ఆమె ఎమోషన్స్‌ పలికించే తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా మజిలీ సినిమాలో ఆమె ఎంట్రీ సీన్ థియేటర్స్ లో విజిల్స్ తో మారుమోగిపోయాయి. ఈసినిమాతో నటి గా ఆమె రేంజ్ మారిపోయింది. అందుకే ఇక నుండి తన పాత్ర కి ఇంపార్టెన్స్ ఉండే పాత్రలే చేయాలనీ నిర్ణయించుకుంది ఈ బ్యూటీ . తనకు నచ్చిన కథలే చేస్తూ ఎంజాయ్ చేస్తున్న సామ్ మరి కొన్ని రోజుల్లో ‘ఓ బేబీ’ అనే కొరియన్ రీమేక్ చిత్రం మన ముందుకు రానుంది.

రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ లో సామ్ ను చూస్తూనే ఆ పాత్ర కోసం ఎంతగా లీనమయిందనేది అర్థమవుతుంది. ఈ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేనప్పటికీ ట్రైలర్ లో సామ్ నటన చూస్తే కచ్చితంగా ఈమూవీ చూడాల్సిందే అనే భావన కలుగుతుంది. ఈమూవీ తో సామ్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకోగలిగితే ఆమె ఇకపై మరిన్ని అద్భుతమైన పాత్రలు ఆశించవచ్చు అనిపిస్తోంది.

Tags:    

Similar News