వాళ్ళముందు సమంత రేంజే వేరప్పా

సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా ఇలా అందరూ కొద్దిగా అటు ఇటుగా టాలీవుడ్ కి పరిచయం అయినవారే. కాజల్, సమంత ఇద్దరూ దగ్గర ద్గగర స్టార్ స్టేటస్ [more]

Update: 2019-07-09 06:15 GMT

సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా ఇలా అందరూ కొద్దిగా అటు ఇటుగా టాలీవుడ్ కి పరిచయం అయినవారే. కాజల్, సమంత ఇద్దరూ దగ్గర ద్గగర స్టార్ స్టేటస్ అనుభవించారు. తమన్నా మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో నటించకపోయినా.. స్టార్ హీరోలందరితో నటించింది. ఇక సమంత, కాజల్ ఇద్దరూ పోటాపోటీగా నటిస్తూ వచ్చారు. ఇక వాళ్లలో సమంత పెళ్లి చేసుకుని సెటిల్ అవడమే కాదు.. కెరీర్ లోను దూసుకుపోతుంది. ఇక కాజల్ పెళ్లి పేరెత్తకుండా ఇంకా నటిస్తూనే ఉంది. మొన్నామద్యలో నేనే రాజు నేనే మంత్రి హిట్ అయ్యి.. కాజల్ మళ్ళీ పుంజుకుంది అనుకుంటే… ఈఏడాది సీత లాంటి సినిమాలు ఆమెను వెనక్కి నెట్టేశాయి.

ఇక తమన్నా ఈమధ్యకాలంలో నటించిన సినిమాలు చాలా వరకు ప్లాప్స్. అయినా బాలీవుడ్ మీద మక్కువతో టాలీవుడ్ ని చిన్న చూపు చూస్తుంది ఈ చిన్నది. ఇక కాజల్, తమన్నాలు పరిస్థితి అలా ఉంటే.. సమంత మాత్రం ఇప్పటికి క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యు టర్న్, తమిళనాట సూపర్ డీలక్స్, ఇక తాజాగా ఓ బేబీ, మజిలీ సినిమాల హిట్ తో సమంత ఇంకా క్రేజీగా తయారైంది. కానీ సమంత ముందు కాజల్, తమన్నాలు వెల వెల బోతున్నారు. పెళ్లి చేసుకోకుండా ఇంకా హీరోయిన్స్ వేషాల కోసం వారు ఎదురు చూస్తుంటే.. సమంత మాత్రం పెళ్లి చేసుకుని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది

Tags:    

Similar News