మజిలీ కి ఎంత తీసుకున్నారో తెలుసా..!

టాలీవుడ్ లో లవ్లీ కపుల్ ఎవరు అంటే వెంటనే సమంత – నాగ చైతన్య అంటాం. చాలా ఏళ్లు ప్రేమించుకుని పెద్దల ఆగీకారంతో గత ఏడాది పెళ్లి [more]

Update: 2018-12-25 06:17 GMT

టాలీవుడ్ లో లవ్లీ కపుల్ ఎవరు అంటే వెంటనే సమంత – నాగ చైతన్య అంటాం. చాలా ఏళ్లు ప్రేమించుకుని పెద్దల ఆగీకారంతో గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంట విడివిడిగా సినిమాలు చేస్తూ వచ్చారు. పెళ్లి తరువాత సామ్ సినిమాలు చేయడం కష్టం అనుకున్న వారంతా ఇప్పుడు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. వరుస సినిమాలు హిట్ అవ్వడంతో అమ్మడు పెళ్లి తరువాత రెమ్యూనరేషన్ పెంచిందని టాక్. పెళ్లికి ముందు చెయ్ – సామ్ విడివిడిగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అయితే పెళ్లి తరువాత ఇద్దరు కలిసి ఒకే పారితోషికం తీసుకుంటున్నారట. అవును వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘మజిలీ’ అనే సినిమాకు జాయింట్ గా రెమ్యూనరేషన్ అందుకున్నారు. నిర్మాత సాహు గారపాటి వీళ్లిద్దరికీ కలిపి రూ.6 కోట్ల 50 లక్షల చెక్ ఇచ్చాడట.

ఎలా పంచుకుంటారో మరి…

ఈ చెక్ ను నాగ చైతన్య డైరెక్ట్ గా తీసుకున్నాడట. మరి ఇందులో సామ్ కి ఎంత ఇస్తాడు అనేది వారిద్దరి మధ్య విషయం. టాలీవుడ్ లో సమంత టాప్ హీరోయిన్ కాబట్టి 2 నుండి 3 కోట్ల వరకు తీసుకుంటుంది. చైతు 3 నుండి 4 కోట్ల వరకు తీసుకుంటాడు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుత షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుటివరకు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని టాక్.

Tags:    

Similar News