అమ్మో టెర్రరిస్ట్ గానా?

అందమైన హీరోయిన్ ని టెర్రరిస్ట్ గా ఊహించుకోవడానికి ఆమె అభిమానులు చాల ఇబ్బందులు పడతారు. టాలీవుడ్, కోలీవుడ్ లోను విభిన్న పాత్రలతో సూపర్ హాట్ టాప్ హీరోయిన్ [more]

Update: 2020-05-15 11:14 GMT

అందమైన హీరోయిన్ ని టెర్రరిస్ట్ గా ఊహించుకోవడానికి ఆమె అభిమానులు చాల ఇబ్బందులు పడతారు. టాలీవుడ్, కోలీవుడ్ లోను విభిన్న పాత్రలతో సూపర్ హాట్ టాప్ హీరోయిన్ గా ఇప్పటికి అంటే  పెళ్లి తర్వాత కూడా వెలిగిపోతున్న సమంత… ఇప్పుడు సినిమాలలో కాకుండా వెబ్ సీరీస్ లోను నటించి షాకిచ్చింది. ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో సమంత నటించింది. ఎప్పుడు హాట్ గా, గ్లామర్ గా, నటన పరంగా ది  బెస్ట్ అందించిన సమంత అందరికన్నా ముందుగా వెబ్ సీరీస్ లో అడుగుపెట్టింది.

అయితే సమంత ద ఫ్యామిలి మెన్ వెబ్ సీరీస్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తుంది అనే టాక్ ఉంది. ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ కి విపరీతమైన ఆదరణ లభించింది. పాక్ టెర్రరిస్ట్ లకు, మనోజ్ బజ్ పాయ్ ఎన్ ఏసికి… పాక్ టెర్రరిస్ట్ లకి మధ్య జరిగిన యాక్షన్ డ్రామా ఆ వెబ్ సీరీస్ ని ఎక్కడో నిలబెట్టింది. ఇప్పుడు సమంత సీజన్ 2 లో కనిపించబోతుంది. అయితే నెగెటివ్ షేడ్స్ అంటే ఏదో అనుకున్నవారికి ఇప్పుడు సామ్ కేరెక్టర్ చూసి షాకవ్వాల్సిందే అంటున్నారు. అంటే ఈ వెబ్ సీరీస్ లో సమంత పాక్ టెర్రరిస్ట్ గా కనబడబోతుందట. ముందు మామూలుగానే కనిపించే క్యారెక్టర్, తర్వాత స్వరూపం మార్చుకుంటుందని అంటున్నారు. మరి అందమైన హాట్ హీరోయిన్ అలా టెర్రరిస్ట్ గా గ్లామర్ లెస్ గా కనబడితే ఆమె అభిమానులు హార్ట్ అవ్వరూ. అయినా సమంత ఎప్పుడు భిన్నంగా ట్రై చేస్తుంది. ఇప్పుడు అంతే. 

Tags:    

Similar News