ఎన్టీఆర్ లో మరో స్టార్ హీరోయిన్ నటించబోతుంది

Update: 2018-11-18 06:56 GMT

నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ గా బాలకృష్ణ..బావసతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్య బాలన్...హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్..అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్..శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్..సావిత్రి పాత్రలో నిత్య మీనన్..చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో మరో స్టార్ హీరోయిన్ నటిస్తుందని సమాచారం. అక్కినేని సమంత ఇందులో ఒక రోల్ చేస్తుందని టాక్. అయితే సమంత ఏ రోల్ లో నటిస్తోందో అని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన జమున లేదా కాంచన పాత్రల్లో ఏదొక పాత్రలో సమంత నటించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆఫిషల్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

బుర్ర సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్న ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. విష్ణు..సాయి కొర్రపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Similar News