నయన్ కి రీప్లేస్ సమంతనా?

నయనతార కోలీవుడ్ లో లేడి సూపర్ స్టార్ రేంజ్ లో దూసుకుపోతుంది. పెళ్లి అనే పదాన్ని దగ్గరకి రాకుండా… ప్రియుడు విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా [more]

Update: 2019-07-08 05:14 GMT

నయనతార కోలీవుడ్ లో లేడి సూపర్ స్టార్ రేంజ్ లో దూసుకుపోతుంది. పెళ్లి అనే పదాన్ని దగ్గరకి రాకుండా… ప్రియుడు విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా ఈ భామ అటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తోనూ, ఇటు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గాను, మరోపక్క కోలీవుడ్ కుర్ర హీరోలకు నయన్ బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఆ రేంజ్ లో సినిమాలు చేస్తున్న నయనతార ని స్టార్ హీరోలతో పోలుస్తూ లేడి సూపర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేసారు. అటు గ్లామర్ గాను, ఇటు నటన పరంగాను నయనతారే నెంబర్ వన్ అన్న రేంజ్ లో ఉంది ఆమె చేసే సినిమాలు చూస్తుంటే. నయనతార లా ఇప్పుడు టాలీవడ్ హీరోయిన్ సమంత కూడా లేడి ఒరింటెడ్ మూవీస్ తో దూసుకుపోతుంది.

నయనతార గతంలో తమిళంలో అరామ్ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటించింది. ఆసినిమాలో కలెక్టర్ పాత్రలో నయనతార నటన సింప్లి సూపర్బ్. దర్శకుడు గోపి నైనార్ తెరకేకించిన ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అదే చిత్రం తెలుగులో కర్తవ్యమ్ పేరుతొ విడుదలై హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనుకున్నది గోపి నైనార్. అయితే ఈ సినిమాలో నయన్ నటించే ఛాన్స్ లేదట. ఎందుకంటే నయనతార ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్తోనూ, అలాగే మరో రెండు సినిమాల్తో బిజీగా ఉండడంతో.. నయన్ ప్లేస్ లోకి ప్రస్తుతం టాప్ క్రేజ్ ఉన్న సమంత ని తీసుకుందామని ఆలోచనలో గోపి నైనార్ ఉన్నట్లుగా సమాచారం. ఎలాగూ సమంత కి కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో… అరామ్ సీక్వెల్ కి సమంతానే ఫైనల్ చేసే యోచనలో దర్శకుడు ఉన్నట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News