అక్కినేని పరువు కాపాడుతున్న సామ్

అక్కినేని సమంత కు చైతు కన్న మార్కెట్ ఎక్కువ. ఆమె సోలో సినిమాల తో ఈ విషయం అర్ధం అయింది. మజిలీ సినిమాతో నాగ చైతన్య మంచి [more]

Update: 2019-07-15 10:37 GMT

అక్కినేని సమంత కు చైతు కన్న మార్కెట్ ఎక్కువ. ఆమె సోలో సినిమాల తో ఈ విషయం అర్ధం అయింది. మజిలీ సినిమాతో నాగ చైతన్య మంచి వసూళ్లు తెచ్చుకున్నాడు. అయితే చైతు సోలో గా సాధించని అత్యధిక వసూళ్లని ఓవర్సీస్‌లో అతని సతీమణి దాటేసింది. చైతన్య కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమమ్ చిత్రం ను సామ్ తన ఓ బేబీ చిత్రం తో అవలీలగా దాటేస్తోంది.

ప్రస్తుతం స్టాండర్డ్ గా ఆడుతున్న ఈసినిమా అన్ని కలిసి వస్తే త్వరలోనే మిలియన్‌ డాలర్ల మార్కుని దాటినా ఆశ్చర్యం లేదని ట్రేడ్‌ అంటోంది. గత వారం రిలీజ్ అయినా రెండు చిన్న సినిమాలు ఓవర్సీస్ లో తుస్ మన్నాయి. దాంతో ఓ బేబీ కు ప్లస్ అయింది. రెండో వీక్ లో కూడా సామ్ మంచి వసూళ్లు రాబడుతుంది.

సోలో హీరోయిన్ గా అనుష్క తరువాత అక్కినేని సమంత ఓవర్సీస్ లో అంతటి మార్కెట్ దక్కించుకుంది. అందుకే సమంత తరువాత సినిమాలు లేడీ ఓరియంటెడ్ వైపే చూస్తుందట. అక్కినేని ఫ్యామిలి పేరు ఆ విధంగా కాపుడుతుంది సామ్.

Tags:    

Similar News