క్రేజీ లేడి.. కిల్లింగ్ లుక్

స్టార్ హీరోల సినిమాలు లేకపోతేనేమి.. ఎప్పుడూ బిజీగా వుండే సమంత సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టా లో తన లేటెస్ట్ పిక్స్ [more]

Update: 2019-11-22 06:07 GMT

స్టార్ హీరోల సినిమాలు లేకపోతేనేమి.. ఎప్పుడూ బిజీగా వుండే సమంత సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టా లో తన లేటెస్ట్ పిక్స్ ని పోస్ట్ చేసే సమంత.. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఏఎన్నార్ అవార్డ్స్ ఫంక్షన్ కి డుమ్మా కొట్టింది. అక్కినేని ఫ్యామిలిలో సమంత మిస్ అవడం అభిమానులకు బాధేసింది. అయితే సమంత 96 రీమేక్ పూర్తి చేసి… ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ షూటింగ్ కోసం ముంబైలో ఉండడం వల్లనే అక్కినేని ఫంక్షన్ కి అటెండ్ కాలేదని తెలుస్తుంది.

తాజాగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లుక్ చూసిన వారు… క్రేజీ లేడి కిల్లింగ్ లుక్ అంటూ కితాబునిచ్చేస్తారు. ఎల్లో డ్రెస్ లో చేతినిండా గాజులతో.. చెవులకిపెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. సమంత చూసే చూపులకి మత్తెక్కడం ఖాయం. పెళ్ళైనా క్రేజ్ ఏమాత్రం తగ్గని సమంత డీసెంట్ అందాలకు చైతు పడిపోవడం కామనే… కానీ యంగ్ హీరోలు పడిపోతేనే కష్టం. మరి పాత్ర నచ్చితే…. గ్లామర్ షో కి రెడీ అంటున్న సమంత తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఉంది కానీ.. సమంత క్లారిటీనే లేదు

Tags:    

Similar News