నాగ శౌర్య ప్లేస్ లో అడివి శేష్

ఈ ఏడాది సమంత నటిస్తున్న రెండు సినిమాలు మంచి ప్రాధాన్యత సంతరించుకున్న సినిమాలే కావడం గమనార్హం. పెళ్లి తర్వాత నటనకు ప్రాధాన్య మున్న పాత్రల్లోనే కనబడుతున్న సమంత [more]

Update: 2019-02-09 11:07 GMT

ఈ ఏడాది సమంత నటిస్తున్న రెండు సినిమాలు మంచి ప్రాధాన్యత సంతరించుకున్న సినిమాలే కావడం గమనార్హం. పెళ్లి తర్వాత నటనకు ప్రాధాన్య మున్న పాత్రల్లోనే కనబడుతున్న సమంత తాజాగా భర్త నాగ చైతన్యతో కలిసి శివ నిర్వాణం దర్శకత్వంలో మజిలీ సినిమా చేస్తుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. మజిలీ సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇక తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తుంది

నందిని రెడ్డి ఈ సినిమాని ఒక కొరియన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంత యంగ్ గర్ల్ గా 60 ఏళ్ళ వృద్ధిరాలిగా కనిపించబోతుందనే టాక్ ఉంది. ఇక ఈ సినిమాకి ఓ బేబీ ఎంత సక్కగున్నావే అనే టైటిల్ పరిశీలనలో ఉండగా.. ఈ సినిమాలోలో ఒక ప్రాధాన్యమున్న పాత్ర లో హీరో నాగ శౌర్య నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే నాగ శౌర్య ప్లేస్ లో ఇప్పుడు అడివి శేష్ పేరు వినబడుతుంది. క్షణం, గూఢచారి సినిమా ల్తో హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్న అడివి శేష్ ఆ పాత్రలో నటిస్తే బావుంటుందని సమంత నందిని తో చెప్పిందట.

ఇక నందిని రెడ్డి అడివి శేష్ ని సంప్రదించగా.. సమంత తో ఉన్న ఫ్రెండ్ షాప్ కొద్దీ అడివి శేష్ మారు మట్లాడకుండా ఆ కేరెక్టర్ చెయ్యడానికి ఒప్పేసుకోవడమే కాదు… ఇప్పటి కే సమంత, అడవి శేషుకి సంబందించిన కీలక సన్నివేశాలను దర్శకురాలు నందిని రెడ్డి చిత్రీకరించినట్లుగా సమాచారం.

Tags:    

Similar News