మజిలీ గురించి సామ్ ఏమంటుంది..?

నిన్ను కోరి లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు. కథనం, సాంగ్స్, నాని, నివేధా [more]

Update: 2019-02-22 13:24 GMT

నిన్ను కోరి లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు. కథనం, సాంగ్స్, నాని, నివేధా థామస్ యాక్టింగ్ కు యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అదే ఊపుతో శివ మరో లవ్ స్టోరీని రాసుకున్నాడు. నాగ చైతన్య – సమంత జంటగా ‘మజిలీ’ సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తి చేసుకుంది. షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో టీం అంతా కలిసి ఓ గ్రూప్ దిగారు.

ట్వీట్ చేసిన సమంత

ఆ ఫోటోను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ పూర్తయిందనీ.. ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతుందని సమంత ట్వీట్ చేసింది. ఇంత మంది టీంతో ఈ సినిమాకి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. పెళ్లి తరువాత చైతు, సామ్ చేస్తున్న సినిమా కాబట్టి దీనిపై అంచనాలు ఏర్పడాయి. టీజర్ బట్టి చూస్తుంటే ఇది పక్కా హిట్ బొమ్మ అని అర్ధం అవుతుంది.

Tags:    

Similar News