అందుకే బాలీవుడ్ లో సినిమాలు చేయను: సమంత!

సమంత…ఈపేరు తో పాటు సక్సెస్ కూడా రాయలేమో. సామ్ చేసిన సినిమాలు అన్ని దాదాపు హిటే. సౌత్ లో రెండుమూడు సినిమాలు హిట్ అయితే వెంటనే బాలీవుడ్ [more]

Update: 2019-06-21 09:18 GMT

సమంత…ఈపేరు తో పాటు సక్సెస్ కూడా రాయలేమో. సామ్ చేసిన సినిమాలు అన్ని దాదాపు హిటే. సౌత్ లో రెండుమూడు సినిమాలు హిట్ అయితే వెంటనే బాలీవుడ్ కి వెళ్లిపోవాలని చూసే మన హీరోయిన్స్ లా కాదు సమంత. తన టాలెంట్ కి బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చినా చేసేలా లేదు. ఆమె ఓకే అంటే హిందీ లో కూడా నిర్మాతలు రెడీ గా ఉన్నారు. కానీ సామ్ కి నార్త్ సినిమాల్లో చేయడం అసలు ఇష్టం లేదు. మీకు నార్త్ నుండి అవకాశం వస్తే నార్త్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తారా? అని అడిగితే విచిత్రం గా సమాధానం చెప్పింది సమంత.

“అసలు నాకు నార్త్ ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో తెలియదు, నా నుండి వాళ్ళు ఏమి కోరుకుంటారో తెలియదు. వాళ్ళ అభిరుచుల పై నాకు అంతగా అవగాహన కూడా లేదు.నేను ఒక ఏలియన్ లా కనిపిస్తా వాళ్ళకి. అందుకే నేను నార్త్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. అయినా నేను సౌత్ ప్రేక్షకుల కోసం చాలానే చేయాలి. ఇంకా మంచి కథలు, పాత్రలు చేసి వారి మెప్పించాలి” అని అంటుంది సామ్. ప్రస్తుతం నటించిన ఓ బేబీ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చింది సామ్.

Tags:    

Similar News