మనకెందుకీ టాక్ షోస్!

ఏమాటన్నది ఎవరో కాదు సమంత అభిమానులు అలాగే అక్కినేని అభిమానులు. పెళ్లి తరవాత అవకాశాలు రావనుకున్నాను.. కానీ అదృష్టం ఉంది అందుకే అవకాశాలు వస్తున్నాయంటూ చెబుతున్న సమంత [more]

Update: 2020-12-19 10:23 GMT

ఏమాటన్నది ఎవరో కాదు సమంత అభిమానులు అలాగే అక్కినేని అభిమానులు. పెళ్లి తరవాత అవకాశాలు రావనుకున్నాను.. కానీ అదృష్టం ఉంది అందుకే అవకాశాలు వస్తున్నాయంటూ చెబుతున్న సమంత ఇప్పటికీ సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. కానీ సమంత ఒప్పుకోవడం లేదు. పెళ్లి తర్వాతే రంగస్థలం, మహానటి, మజిలీ, ఓ బేబీ వంటి గ్రాండ్ హిట్స్ ఇచ్చిన సమంత తర్వాత నటిగా తనకొచ్చిన అవకాశాలను పక్కనబెట్టి ఓటిటి వైపు అడుగులు వేసింది. ఫ్యామిలీ మ్యాన్ లో నటించేందుకు ఉత్సాహాన్ని చూపించింది. 

ఓటిటి ఓకె అనుకుంటే ఇప్పుడు అది కూడా చాలదంటూ ఆహా అంటూ సామ్ జామ్ షో కి వ్యాఖ్యాత గా మారింది. సామ్ జామ్ షో అంటూ హడావిడి చేసిన ఆహా ఓటిటికి సమంత కి సామ్ జామ్ షో ఫస్ట్ ఎపిసోడ్ కే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ, తమన్నా లాంటి స్టార్స్ వచ్చినా.. రేపు చిరంజీవిని తెచ్చినా.. ఇప్పటికీ ఆ షో పై క్రేజ్ రాకపోవడం అటు సమంత ఫాన్స్ నే కాదు ఇటు అక్కినేని ఫాన్స్ అందరిని నిరాశలో ముంచేసింది. మరి వెండి తేర మీద అద్భుతాలు సృష్టించిన సమంత ఇలా బుల్లితెర మీద ప్లాప్ గా మారడం సమంత అభిమానులనే కాదు ఇటు అక్కినేని ఆభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మనకెందుకీ టాక్ షోస్ అంటున్నారు.

Tags:    

Similar News