సల్మాన్ క్రేజ్ కి సరిపోతుందా?

బాలీవుడ్ కండల వీరుడు సల్లు భాయ్.. సినిమాలు వరసబెట్టి ప్లాప్స్ అయినా.. సల్మాన్ ఖాన్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గదు. సల్మాన్ సినిమాలంటేనే కాదు.. సల్మాన్ ఖాన్ ఏ [more]

Update: 2020-03-05 12:32 GMT

బాలీవుడ్ కండల వీరుడు సల్లు భాయ్.. సినిమాలు వరసబెట్టి ప్లాప్స్ అయినా.. సల్మాన్ ఖాన్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గదు. సల్మాన్ సినిమాలంటేనే కాదు.. సల్మాన్ ఖాన్ ఏ పని చేసిన అభిమానులకు ముచ్చటే. సల్మాన్ క్రేజ్ తో భారీగా దండుకుంటూ సినిమాల్తో పాటుగా బుల్లితెర మీద అలాగే…. పలు యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నాడు. సల్మాన్ క్రేజ్ కి బడా కంపెనీలు సలాం కొడుతున్నాయి. తాజాగా ఓ యాడ్ షూట్ కోసం సల్మాన్ ఖాన్ రోజుకి ఏకంగా 7 కోట్లు అందుకోబోతున్నాడనే న్యూస్ ఇపుడు సెన్సేషన్ అయ్యింది. ఎందుకంటే పలు సినిమాల్తో బిజీగా వున్న సల్మాన్ కాల్షీట్ దొరకడమే ప్రసాదం కనక సల్మాన్ కి ఆలా రోజుకి 7 కోట్లు చొప్పున సమర్పిస్తున్నారన్నమాట.

చైనీస్ స్మార్ట్ఫోన్‌ బ్రాండ్‌కి సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. ఇప్పటికే దీనికి సంబందించిన కాంట్రాక్ట్‌పై సల్మాన్ సంతకం కూడా చేసాడు. అయితే ఆ బ్రాండ్ ని పబ్లసిటీ చేసేందుకు సల్మాన్ దానికి సంబందించి ఆ యాడ్ లో నటించాల్సి ఉంది. అయితే ఆ యాడ్ షూట్ చెయ్యడానికి ఓ వారమైన పడుతుంది అని.. సల్మాన్ క్రేజ్ దృష్ట్యా సల్మాన్ కి రోజుకి 7 కోట్లు ఆ యాడ్ షూట్ పాల్గొన్నందుకు ఇచ్చేందుకు సదరు కంపెనీ రెడీ అయ్యినత. మరి వారం రోజులు, రోజుకి 7 కోట్లు.. దీనిలెక్కన 7 రోజులకి సల్మాన్ 49 కోట్లు అందుకోబోతున్నాడన్నమాట. మరి సల్మాన్ ఇంత పెద్ద మొత్తం అందుకున్న ఫస్ట్ స్టార్ హీరో అవుతాడేమో. ఎందుకంటే ఇప్పటివరకు ఏ హీరో కూడా ఈ రేంజ్ పారితోషకం అందుకోలేదు కాబట్టి.

Tags:    

Similar News