ఇది కదా.. సల్మాన్ స్టామినా

సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందొ చెప్పక్కర్లేదు. సల్మాన్ సినిమాలు ప్లాప్ అయినా ఆయన తర్వాతి సినిమా మీద బోలెడంత క్రేజ్ ఉంటుంది. [more]

Update: 2019-06-09 13:16 GMT

సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందొ చెప్పక్కర్లేదు. సల్మాన్ సినిమాలు ప్లాప్ అయినా ఆయన తర్వాతి సినిమా మీద బోలెడంత క్రేజ్ ఉంటుంది. అందులోను సల్మాన్ అంటే రంజాన్ హీరో. ప్రతి రంజాన్ కి తన సినిమా విడుదల చేసి రంజాన్ హీరోలా హిట్స్ కొడుతూనే ఉన్నాడు. అందుకే రంజాన్ సెంటిమెంట్ తో చాలా సినిమాలు చేసాడు. ఈ ఏడాది రంజాన్ కానుకగా భారత్ సినిమా ని విడుదల చేసాడు. కత్రినా కైఫ్, దిశా పటాని హీరోయిన్స్ గా తెరకెక్కిన భారత్ కి మొదటి షోకే కె యావరేజ్ టాక్ పడింది. అయినప్పటికీ అదిరిపోయే ఓపెనింగ్స్ తో సల్మాన్ భారత్ సినిమాతో రికార్డు సృష్టించాడు. మొదటి రోజే 42 కోట్లు కొల్లగొట్టాడు.

ఇక రెండో రోజున 31 కోట్లను, మూడో రోజున 28 కోట్లు కొల్లగొట్టిన సల్మాన్ ఖాన్ నాలుగో రోజుకే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయాడు. మరి సినిమాకి యావరేజ్ టాక్ పడినా సల్మాన్ క్రేజ్ తోనే ఇంతటి భారీ కలెక్షన్స్ ని భరత్ కొల్లగొడుతుంది. ఇక ఇంతటి విజయాన్ని అందుకున్న సల్మాన్ రోజుకో రంజాన్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక ఈ రంజాన్ కి యావరేజ్ తోనే భారీ కలెక్షన్స్ తో హిట్ అందుకున్న సల్మాన్ వచ్చే రంజాన్ కి మరో సినిమాని రెడీ చేస్తున్నాడు.

Tags:    

Similar News