అలా ని పట్టేసిన ఖాన్ సాబ్?

సల్మాన్ ఖాన్ కి తెలుగు సినిమాలు రీమేక్ చెయ్యడం అంటే సరదా కాదు.. సల్మాన్ ఖాన్ తెలుగు రీమేక్స్ తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. [more]

Update: 2020-02-09 06:29 GMT

సల్మాన్ ఖాన్ కి తెలుగు సినిమాలు రీమేక్ చెయ్యడం అంటే సరదా కాదు.. సల్మాన్ ఖాన్ తెలుగు రీమేక్స్ తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఎక్కువ తెలుగులో హిట్ అయిన సినిమాలపై సల్మాన్ ఖాన్ కన్ను ఉంటుంది. కాకపోతే తనకి సెట్ అయ్యే సినిమాలైతే ఆ సినిమాల రీమేక్ రైట్స్ కోసం పోటీ పడి దక్కించుకుంటాడు. అయితే తాజాగా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అల వైకుంఠపురములో సినిమాని సల్మాన్ బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లుగా ఓ న్యూస్ టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లోనే కాదు.. బాలీవుడ్ మీడియాలోనూ నడుస్తుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన అలా వైకుంఠపురములో సినిమా రీమేక్ గురించి సల్మాన్ ఆలోచిస్తున్నాడు అనగానే… ఆసినిమా హిందీ రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్థే భారీ రేటుకి కొనేసాడు.

గత కొన్నేళ్లుగా సల్మాన్ ఏ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడడం లేదు. దానితో సల్మాన్ క్రేజ్ పడిపోతుంది.. అందుకే ఈ రీమేక్ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా టాక్. అయితే అల వైకుంఠపురములో రీమేక్ రైట్స్ ని 8 కోట్లకి అశ్విన్ వర్థే కొనగా… హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు మరో క్రేజీ బాలీవుడ్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అలాగే బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా హిందీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాని రీమేక్ చెయ్యాలనే ఆలోచనలో సల్మాన్ ఉన్నాడట. ఇక అలా వైకుంఠపురములో డిజిటల్, శాటిలైట్ హక్కులను జెమిని వాళ్లు భారీ రేటుకే కొనుగోలు చేశారు.. ఈ సినిమా విడుదలైన రోజునుండి 87 రోజుల తర్వాత డిజిటల్ ప్లేట్ ఫామ్ లో ఈ సినిమా ప్రదర్శించబడుతుంది అని చెబుతున్నారు.

Tags:    

Similar News