రాజమౌళికి సల్మాన్ రికమెండ్ చేసింది ఆమెనేనా..?

తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువ ఎదురుచూస్తున్న సినిమా #RRR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో [more]

Update: 2019-04-26 13:08 GMT

తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువ ఎదురుచూస్తున్న సినిమా #RRR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. 2020లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఏర్పడాయి. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా ఫైనల్ అయింది. ఇక ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ నటించాల్సి ఉంది. కానీ ఆమె కొన్ని కారణాలు వల్ల సినిమా నుండి తప్పుకోవడంతో తెరపైకి చాలా పేర్లు వస్తున్నాయి.

బాలీవుడ్ భామలు పేర్లు…

అందులో ‘సాహో’ బ్యూటీ శ్రద్ధ కపూర్, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇద్దరికీ డేట్స్ లేకపోవడంతో ఈ మూవీని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా తెరపైకి మరో హీరోయిన్ పేరు వచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వయంగా రాజమౌళికి రికమెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Tags:    

Similar News