ఖరీదైన కార్లను నాశనం చేసిన సల్మాన్!

Update: 2018-05-30 04:17 GMT

కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో 'రేస్ 3' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇండియా వైడ్ ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో ఒక సీన్ లో సల్మాన్ ఖాన్ ప్యారా గ్లైడింగ్ చేస్తూ ఒక సీన్ ఉంది. అది ప్రభాస్ 'సాహో' మూవీ నుండి కాపీ కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

అన్నీ ఖ‌రీదైన కార్లే...

అయితే ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ను 'అబుదాబి'లో చిత్రీకరించారు. భారీ చేజింగ్ తో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఖరీదైన కార్లను వాడారట. అందులో భాగంగా ఫెరారీ, లంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్, మసెరటి వంటి ఖ‌రీదైన‌ బ్రాండెడ్ కార్ల‌ను షూటింగ్ కోసం పేల్చేశారట.

డ‌బ్బు కాదు..సీన్ ముఖ్యం..

ఇలా కార్లు బ్లాస్ట్ చేయాల్సి వస్తుందని డైరెక్టర్ రెమో డిసౌజా ముందుగానే నిర్మాతలకు చెప్పాడంట. నిర్మాతలు కూడా డబ్బుకి ఎటువంటి వెనకాడకుండా సీన్ బాగా వస్తే చాలు అనుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. తెరపై ఈ యాక్షన్ సీన్ ఒక రేంజ్ లో ఉంటుందనీ .. ఇంతవరకూ సల్మాన్ చేసిన యాక్షన్ సీన్స్ లో ఇది బెస్ట్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు.

Similar News