అదరగొట్టేసాడుగా

Update: 2018-05-07 07:39 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మార్కెట్ ఎలాంటిదో మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన ప్లాప్ సినిమాకి సైతం 100 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే మాములు విషయం కాదు. తనకి మాస్ ఫాలోయింగ్ ఉండటంతో బయర్స్ కూడా సల్మాన్ ఖాన్ సినిమాను ఫాన్సీ రేట్స్ కి కొనుకుంటారు. అలాగే శాటిలైట్ హక్కుల విషయంలోనూ సల్మాన్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పుతుంటాడు.

సల్మాన్ లాస్ట్ మూవీ 'టైగర్ జిందహై' శాటిలైట్ హక్కులు ఏకంగా రూ.70 కోట్లు పలకడం విశేషం. ఇది అప్పట్లో రికార్డు. అయితే మళ్లీ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ విషయంలో ఇండియాలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు సల్మాన్. తన నెక్స్ట్ 4 సినిమాలను కలిపి ఏకంగా 400 కోట్లకు శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయిందంటే మాములు విషయం కాదు. అంటే సగటు సినిమాకి 100 కోట్లు. అమీర్ ఖాన్ సినిమాలకు సైతం ఈ రేట్ పలకదు.

ప్రముఖ బాలీవుడ్ సంస్థ జీ టీవీ గ్రూప్ ఇటీవలే ఈ డీల్ పూర్తి చేసిందట. సల్మాన్ ఖాన్ అతడి నిర్మాతల మధ్య ఈ డీల్ కుదిరినట్టు తెలుస్తుంది. గతంలో ఇలానే హృతిక్ రోషన్ నాలుగు సినిమాలకు కలిపి రూ.300 కోట్ల శాటిలైట్ ఒప్పందం జరిగింది. ఆ రికార్డుని ఇప్పుడు సల్మాన్ ఖాన్ బీట్ చేసాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘రేస్-3’ లో నటిస్తున్నాడు. దీని తర్వాత ‘భరత్’.. ‘కిక్-2’ సినిమాలు కమిటయ్యాడు. ఈ మూడు కాకుండా నాలుగవ సినిమాకి కమిట్ అయ్యాడు కానీ ఆ వివరాలు ఇంకా బయటికి రాలేదు

Similar News