సల్మాన్ క్రేజ్… ఇక్కడే అర్ధమవుతుంది

బాలీవడ్ స్టార్ హీరోలంతా చాలా కష్టాల్లో ఉన్నారు. ఒకప్పుడు 500 కోట్లక్లబ్బులో సునాయాసంగా కాలు పెట్టిన ఖాన్స్ త్రయం ఇప్పుడు ఆ ఫిగర్ ని చేరుకోవడానికి నానా [more]

Update: 2019-11-05 05:02 GMT

బాలీవడ్ స్టార్ హీరోలంతా చాలా కష్టాల్లో ఉన్నారు. ఒకప్పుడు 500 కోట్లక్లబ్బులో సునాయాసంగా కాలు పెట్టిన ఖాన్స్ త్రయం ఇప్పుడు ఆ ఫిగర్ ని చేరుకోవడానికి నానా యాతన పడుతున్నారు. ఇక బాలీవడ్ లో తాజాగా యావరేజ్, డివైడ్ టాకొచ్చిన సినిమాలు కూడా 200 కోట్ల క్లబ్బులోకి చేరిపోతున్నాయి. ఇక ఖాన్స్ త్రయంలో సల్మాన్ ఖాన్ కి ఉన్న క్రేజే వేరు. సల్మాన్ ఖాన్ సినిమా వస్తుంది అంటే.. అతని ప్లాప్స్ తో సంబంధమే లేకుండా సినిమాపై అంచనాలు వచ్చేస్తాయి. ట్యూబులైట్ వంటి చిత్రం కి ప్లాప్ టాక్ పడినా… ఆ సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకే సల్మాన్ ఖాన్ సినిమాలకు యమా క్రేజ్ అనేది.

తాజాగా సల్మాన్ ఖాన్… ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ సీరీస్ లో నటిస్తున్నాడు. దబాంగ్ 3 ని 80 కోట్ల బడ్జెట్ లోనే తెరకెక్కించారు. ఇక ఆ 80 కాకుండా సినిమా ప్రమోషన్స్ కి మరో 20 కోట్లు వేసుకున్నా.. మొత్తం దబాంగ్ 3 కి 100 కోట్ల పెట్టుబడి ఎక్కింది. అయితే సల్మాన్ కున్న క్రేజ్ దృష్ట్యా దబాంగ్ 3 బిజినెస్ భీబత్సంగా మొదలైనట్టుగా టాక్. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ని స్వయానా నిర్మిస్తున్నాడు. హీరో, నిర్మాతగా దబాంగ్ 3 ని నాన్ థియేట్రికల్ రైట్స్ ని ఏకంగా 150 కోట్ల రూపంలో రాబట్టాడట. సల్మాన్ సినిమాలకు భారీ శాటిలైట్ బిజినెస్ జరుగుతుంది. ఆ లెక్క ప్రకారం దబాంగ్ 3 శాటిలైట్ కి 80 కోట్లు, డిజిటిల్ హక్కులకు 60 కోట్లు, మ్యూజిక్ హక్కులకు 15 కోట్లు సల్మాన్ నాన్ థియేట్రికల్ హక్కుల కింద అందుకున్నట్లుగా టాక్. మరి నాన్ థియేట్రికల్ హక్కులతోనే 50 కోట్లు లాభాలు వెనకేసుకున్న సల్మాన్ ఇప్పుడు థియేట్రికల్ హక్కుల ద్వారా మరో 100 కోట్లు వెనకెయ్యడం ఖాయమంటున్నారు. మరి సల్మాన్ ఈ లాభాలను బయట నిర్మాతలకెందుకు ఇవ్వాలని.. స్వయంగా తానే తన సినిమాలను ఎవరో ఒకరితో కలిసి నిర్మించేసుకుంటూ.. లాభాలు ఆర్జిస్తున్నాడు.

Tags:    

Similar News