“భరత్” సినిమా చిక్కుల్లో పడింది!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది రంజాన్ కి కచ్చితంగా సినిమా రిలీజ్ చేస్తారు. ఎప్పటి నుండో ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్న సల్మాన్ [more]

Update: 2019-06-01 06:18 GMT

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి ఏడాది రంజాన్ కి కచ్చితంగా సినిమా రిలీజ్ చేస్తారు. ఎప్పటి నుండో ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్న సల్మాన్ గత ఏడాది కూడా రంజాన్ కానుకగా వచ్చిన సల్మాన్ మూవీస్ బాక్స్ ఫీస్ రికార్డులను తిరగరాసాయి. ఇప్పుడు అదే ఊపుతో మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు సల్మాన్. “భరత్” అనే క్రేజి టైటిల్ తో సల్మాన్ ఈ రంజాన్ కి మనలన్నీ ఎంటర్టైన్ చేయనున్నాడు. జూన్ 5న విడుదల కానున్న ఈ మూవీ ప్రస్తుతం చిన్న వివాదంలో చిక్కుకుంది.

టైటిల్ విషయంపై ఢిల్లీకి చెందిన విపిన్ త్యాగి అనే ఓ వ్యక్తి “భరత్” అనే టైటిల్ పై అభ్యంతరం తెలుపుతూ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక సినిమాకి “భరత్” అనే పేరు పెట్టడం నిబంధనలకు విరుద్ధం అని, వెంటనే మూవీ టైటిల్ మార్చివేయాలని ఆయన వాదన. మరి కోర్ట్ ఏమంటుందో చూడాలి. ఇక ఇందులో సల్మాన్ సరసన మరోసారి కత్రినా కైఫ్ నటించింది.అలీ అబ్బాస్ జఫ్ఫార్ దర్శకత్వం వహించగా, రీల్ లైఫ్ ఫిలిమ్స్, సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్,టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈమూవీ కి సంబంధించి వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News