సల్మాన్, కత్రినా, అక్షయ్ లపై అమెరికాలో కేసు..!

Update: 2018-06-15 08:41 GMT

బాలీవుడ్ లో కొంత ప్రముఖలపై ఒక అమెరికన్ ప్రమోటర్ ఆ దేశంలో కేసు నమోదు చేశారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్‌వీర్ సింగ్, ప్రభుదేవా, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో పాటు గాయకులు ఉదిత్ నారాయణ్, అల్కా యాజ్ఞిక్, ఉషా మంగేష్కర్‌లపైనా కేసు దాఖలైంది.

తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇవ్వరా...

అంతే కాదు.. మ్యాట్రిక్స్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రైవేటు లిమిటెడ్‌లపై మోసం కేసు దాఖలైంది. ఇల్లినాయిస్‌లోని నార్తరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో చికాగోకు చెందిన వైబ్రెంట్ మీడియా గ్రూప్ పేరుతో కేసు దాఖలైంది. వివరాల్లోకి వెళ్తే.. వందేళ్ల సినిమా పండగ సందర్భంగా సెప్టెంబర్ 1, 2013లో పైనున్న నటులతో ప్రదర్శన ఇప్పించేందుకు వైబ్రెంట్ మీడియా గ్రూప్ ఈ నటులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ సమయంలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై కృష్ణ జింక కేసు ఉండటంతో అప్పుడు ఆ షోను వాయిదా వేశారు. ఒప్పందం ప్రకారం.. సల్మాన్‌కు 2 లక్షల డాలర్లు, కత్రినా కైఫ్‌కు 40 వేలు, సోనాక్షికి 36 వేల డాలర్లు చెల్లించింది. షో కాన్సల్ అవ్వడంతో వారు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో వైబ్రెంట్ మీడియా కోర్టుకెక్కింది.

Similar News