చిరు ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్

మరికొన్ని గంటల్లో సైరా టీజర్ 5 భాషల్లో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఆగస్టు 22 [more]

Update: 2019-08-19 09:14 GMT

మరికొన్ని గంటల్లో సైరా టీజర్ 5 భాషల్లో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఆగస్టు 22 న చిరు బర్త్ డే వస్తున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్ ని రెడీ చేసింది. టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉండడనుంది. ఇంతకుమించి మెగా ఫ్యాన్స్ కి ఏం కావాలి?

ఈవెంట్ లేకుండానే….

అయితే ఈ టీజర్ రిలీజ్ కోసం సైరా యూనిట్ ఎటువంటి ఈవెంట్ చేయడంలేదు. ఎలాగూ 22న మెగా హీరోలతో కలిసి ఫ్యాన్స్ వేడుక చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైన తరుణంలో ఈ ఐడియా డ్రాప్ అయినట్టుగా వినికిడి. సో సైరా టీజర్ ను డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు యూనిట్ సభ్యులు. అక్టోబర్ 2 న ఈమూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదు భాషల్లో బిజినెస్ డీల్స్ పీక్స్ లో ఉన్నాయి. టీజర్ వచ్చాక అవి రేటింపు అయ్యే అవకాశముంది.

Tags:    

Similar News