సైరాకి వార్ దెబ్బ గట్టిగానే పడింది

సైరా సినిమాకి మిగిలిన భాషల్లో పోటీ లేకపోయినా… బాలీవుడ్ లో హృతిక్ రోషన్ వార్ గండం ఉంది. వార్ సినిమా కూడా సైరాతో పాటుగా రేపే విడుదలవుతుంది. [more]

Update: 2019-10-01 07:08 GMT

సైరా సినిమాకి మిగిలిన భాషల్లో పోటీ లేకపోయినా… బాలీవుడ్ లో హృతిక్ రోషన్ వార్ గండం ఉంది. వార్ సినిమా కూడా సైరాతో పాటుగా రేపే విడుదలవుతుంది. బాలీవుడ్ లో భారీ హైప్ ఉన్న వార్ సినిమా ఇక్కడ హైదరాబాద్ అంటే నైజాం లోనూ కాస్త క్రేజ్ తో విడుదలవుతుంది. చిరంజీవి సైరా సినిమాకి చాలా చోట్ల ఇంకా బుక్ మై షో లో టికెట్స్ పెట్టలేదు. ఇక వార్ కి హైదరాబాద్ లో ఓపెనింగ్ డే 200 షోలకి పైగా పడడం, బుక్ మై షో లో వార్ టిక్కెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి.

హాట్ కేకుల్లా వార్ టిక్కెట్లు….

బాలీవుడ్ లోనే సైరాకి వార్ దెబ్బపడింది అనుకుంటే… ఇక హైదరాబాద్ లోనూ వార్ జోరు సైరాకి గట్టిగా తాకేట్లుగా కనబడుతుంది. వార్ జోరు కొనసాగుతుంటే.. మరో పక్క బెంగుళూరు లాంటి మహానగరాల్లో సైరా టికెట్స్ ఆన్ లైన్ లో పెట్టలేదు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై వంటి నగరంలో మెగా ఫాన్స్ సైరా టికెట్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్స్ కోసం కాసుకు కూర్చున్నారు. కానీ మల్టిప్లెక్స్ లలో ఇంకా సైరా టికెట్స్ అందుబాటులోకి రాలేదు. ఈ లోపు వార్ సినిమా టికెట్స్ బుకింగ్ ఊపందుకున్నాయి. మరి ఫస్ట్ డే సైరాకీ వార్ దెబ్బ గట్టిగానే పడనుందనిపిస్తుంది.

 

Tags:    

Similar News