ఇంకేం రికవరీ అవుతుంది

సైరా సినిమా హిట్ టాక్ తో డివైడ్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. కొన్నిచోట్ల మినహా సైరా సినిమా కలెక్షన్స్ పెద్దగా ఆశాజనకంగా లేవు. [more]

Update: 2019-10-07 06:23 GMT

సైరా సినిమా హిట్ టాక్ తో డివైడ్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. కొన్నిచోట్ల మినహా సైరా సినిమా కలెక్షన్స్ పెద్దగా ఆశాజనకంగా లేవు. విడుదలైన రోజు కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించినా సైరా గురు శుక్రవారాల్లో కలెక్షన్స్ మరీ డ్రాప్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి టెన్షన్ పట్టుకుంది. శని ఆదివారాల్లో అయినా సైరా కలెక్షన్స్ పుంజుకుంటాయనుకుంటే అదీ అంతగా లేదు. ఓవర్సీసీలో సైరా పరిస్థితి మరీ దారుణంగా వుంది.

ధరలే దెబ్బతీశాయా…?

సైరా సినిమా కలెక్షన్స్ శని, ఆదివారాల్లోనూ పెరగకపోవడానికి కారణం ఏపీలో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడం సైరా సినిమాకి ప్రతికూలంగా మారిందనే వాదన వినిపిస్తోంది. ఏరియాలను బట్టి రూ. 150 నుంచి 300 రూపాయల వరకూ టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేయడంతో పాటు ఫాల్స్ తగ్గాయని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. శని, ఆదివారాలు వెళ్లినా ఇంకా దసరా సెలవులు రెండు రోజులు ఉన్నాయి కాబట్టి సినిమా కలెక్షన్స్ పెరగొచ్చు అని అంటున్నారు.

 

Tags:    

Similar News