గద్దలకొండను దెబ్బకొట్టిన సైరా

గత రెండు రోజులుగా వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ కి భారీ ఓపెనింగ్స్ రావడమే కాదు.. శనివారం కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. మెగా [more]

Update: 2019-09-23 06:50 GMT

గత రెండు రోజులుగా వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ కి భారీ ఓపెనింగ్స్ రావడమే కాదు.. శనివారం కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. మెగా ఫాన్స్ కి సైరా కన్నా ముందు వచ్చిన వాల్మీకి సినిమా హిట్ మంచి జోష్ నిచ్చింది. అయితే సైరా సినిమా ఈవెంట్ తో వాల్మీకి సినిమాకి ఆదివారం సాయంత్రం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ గండి పడింది. ఎందుకంటే ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన చిరంజీవి సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మెగా ఫాన్స్ మొత్తం హైదరాబాద్ లో వాలారు.

వాల్మీకిని లెక్కచేయని మెగా ఫ్యాన్స్….

శని, ఆదివారాల్లో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ టికెట్స్ కోసం పడిగాపులు కాయడంతో వాల్మీకి సినిమాకు తెగాల్సిన భారీ టికెట్స్ కి గండి పడింది. ఇక ఆది వారం ఫస్ట్ షో, సెకండ్ షోకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో థియేటర్స్ చాలావరకు బోసిపోయాయి. శుక్ర, శనివారాల్లో వచ్చిన కలెక్షన్స్ పరంగా చూసుకుంటే… ఆదివారం మాత్రం బాగా డ్రాప్ కనబడింది. సైరా సినిమా కోసమా గత రెండేళ్లుగా మెగాఫ్యాన్ నిరీక్షించడంతో సైరా ఈవెంట్ కోసం వాల్మీకి ని లెక్కచేయలేదు.

 

Tags:    

Similar News