సైరాలో అదే హైలెట్ సీన్

చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహ రెడ్డి రిలీజ్ కి ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో ఫ్యాన్స్ లో [more]

Update: 2019-10-01 06:27 GMT

చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహ రెడ్డి రిలీజ్ కి ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరగడం తో పాటు కంగారు పడుతున్నారు. అసలు ఈ సినిమాలో సీన్స్ ఎలా ఉంటాయి? ఎంతవరకు ఫ్యాన్స్ కి కనెక్ట్ అవుతాయి అని టెన్షన్ పడుతున్నారు. సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలానే ఉన్నాయని ఆమధ్య వార్తలు వచ్చాయి.

ఆ క్లైమాక్స్ భలే…..

అయితే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ సురేంద్ర రెడ్డి సినిమాలో హైలెట్ సీన్ ఏమిటనే విషయాన్ని వెల్లడించారు. క్లైమాక్స్ లో వచ్చే సీన్ చూసినప్పుడల్లా తన హృదయం ఉప్పొంగిందని ఆయన వివరించారు. ఈ క్లైమాక్స్ ప్రతిఒక్కరిని ఉద్వేగానికి గురిచేస్తుందని సురేంద్రరెడ్డి అన్నారు. నరసింహరెడ్డి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎంతగా భయపెట్టి వుంటారో… అలానే చివరి సమయంలో ఆయన వెనుక పదివేల సైన్యం ఉందని తెలిసి తాను ఆశ్చర్యపోయానని…ఇవ్వన్నీ పరిశోధించి నేను క్లైమాక్స్ రాసుకున్నానని దాని బట్టే క్లైమాక్స్ తీసాను అని చెప్పాడు సురేంద్ర రెడ్డి.

 

Tags:    

Similar News