అందుకే ఈ బాలీవుడ్ స్నేహాలు

చిరంజీవి 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 న అని కన్ఫర్మ్ గా సైరా టీం మాట్లాడడమే కానీ… ఎక్కడా ఆఫీషియల్ ప్రకటన లేదు. [more]

Update: 2019-08-07 05:45 GMT

చిరంజీవి 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 న అని కన్ఫర్మ్ గా సైరా టీం మాట్లాడడమే కానీ… ఎక్కడా ఆఫీషియల్ ప్రకటన లేదు. సినిమా విడుదలకు ఇంకా కేవలం రెండు నెలల టైం మాత్రమే ఉంది. అప్పుడెప్పుడో సైరా నరసింహారెడ్డి చిరు లుక్, తమిళనటుడు విజయ్ సేతుపతి లుక్ తో పాటుగా అమితాబ్ లుక్స్ ని రివీల్ చేసింది టీం. కానీ చాలా కాలంగా సైరా కు సంబందించిన అప్ డేట్ బయటికి రావడం లేదు. అదే బాలీవుడ్ లో ఓ సినిమాకి డేట్ ఇచ్చారంటే ఓ మూడు నెలలు ముందుగానే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. హీరో, హీరోయిన్స్ ఎక్కువగా అభిమానులకు, మీడియాకి బాగా దగ్గరగా ఉంటారు. కానీ సైరా సినిమాని నాలుగైదు భాషాల్లో విడుదల చేస్తామని చెబుతున్నారు కానీ.. ప్రమోషన్స్ మాత్రం ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. హిందీ లో అక్టోబర్ 2 న విడుదలకాబోతున్న సినిమాలు ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాయి.

హిందీ ప్రమోషన్స్ మాత్రం….

అయితే చిరు సైరా సినిమా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ ప్రమోషన్స్ గురించి టెన్షన్ పడకపోయినా.. హిందీ ప్రమోషన్స్ ని మాత్రం సైరా టీం కాస్త గట్టిగానే పట్టించుకుంటుందని అంటున్నారు. అయితే తాజాగా చిరు ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుని.. బాలీవుడ్ ప్రమోషన్స్ ని ఓ లెక్క ప్రకారం నిర్వహించడానికి ప్రిపేర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సైరా సినిమాలో ఓ స్పెషల్ రోల్ ప్లే చేసిన అమితాబచ్చన్ ని ప్రమోషన్స్ కోసం బాగా వాడుకోబోతున్నారట అమితాబ్ నటించిన సీన్స్ తో స రా టీజర్ కట్ చేసి.. హిందీలో స్పెషల్ గా వదలాలి అని అనుకోవడమే కాదు…. అమితాబ్ తో ప్రెస్ మీట్స్ గట్రా ప్లాన్ చేస్తున్నారట. ఇక రామ్ చరణ్, ఉపాసన తరుచూ బాలీవుడ్ స్టార్ హీరోలతో మీట్ అవుతున్నారు. కారణం అక్కడ స్పెషల్ గా పీఆర్ టీం ని ఏర్పాటు చేసుకుని స్టార్ హీరోల మద్దతుతో తమ సైరా ప్రమోషన్స్ చెయ్యాలని చరణ్, ఉపాసనలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆ ప్లాన్ మొత్తం రెడీ అయ్యిందని…. ఉపాసన ప్రత్యేకంగా సైరా బాలీవుడ్ ప్రమోషన్స్ మీద దృష్టిపెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News